Congress Slams : మా హయాంలోనే పాల ఉత్పత్తిలో టాప్
ప్రధాన మంత్రి మోదీ కామెంట్స్ పై కాంగ్రెస్
Congress Slams : కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏకి పారేసింది. తమ హయాంలో భారత్ పాల ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్దిని సాధించిందని ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొంది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1998లో భారత దేశం ప్రపంచంలోనే అతి పెద్ద పాల ఉత్పత్తిదారుగా అవతరించిందని గుర్తు చేసింది. 2014 నుండి పాడి పరిశ్రమను పెంచేందుకు గణనీయంగా కృషి చేస్తున్నట్లు చెప్పడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్ పార్టీ(Congress Slams) .
మోదీ వల్ల ఏ ఒక్క రంగంలోనూ భారత్ ముందంజలో లేదని వెల్లడించింది. పాల విప్లవం, ఉత్పత్తుల్లో గణనీయమైన వృద్ధిని సాధించేందుకు త్రిభువందాస్ పటేల్ , డాక్టర్ వి. కురియన్ కృషి చేశారని వారి వల్లనే ఈ ఘనత సాధించ గలిగామని తెలిపింది.
ప్రధాని ప్రచారం చేసుకోవడంలో టాప్ లో ఉన్నారని కానీ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాదని ఎద్దేవా చేసింది. తాము చేసిన పనుల్ని తమవిగా చెప్పుకోవడం ఈ మధ్య ప్రధాన మంత్రికి ఎక్కువై పోయిందని ఆరోపించింది.
వారు సృష్టించిన సహకార సంస్థల వల్లనే శ్వేత విప్లవం సాధ్యమైందని స్పష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉండగా ప్రపంచ పాడి పరిశ్రమ సదస్సులో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టింది. ఒట్టి అబద్దాలు, సొల్లు కబుర్లు తప్ప ఇప్పటి వరకు దేశానికి ప్రధాని చేసింది ఏమీ లేదని మండిపడింది.
2014లో 146 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేసిందని, ప్రస్తుతం అది 210 మిలియన్ టన్నులకు చేరిందని మోదీ చెప్పడాన్ని కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ చార్జి జైరాం రమేష్ ఎద్దేవా చేశారు.
Also Read : వివాదాలకు సైనిక పరిష్కారం లేదు