Top Indian Folk Singers : ఆ గళాలు జానపద సంచలనాలు
అత్యుత్తమ కళాకారులు వీరే
Top Indian Folk Singers : దేశంలో ఎందరో జానపద కళాకారులు ఉన్నారు. వారిలో ఈ ఏడాది అత్యుత్తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. అంతకంటే ఎక్కువగా అలరించారు. విభిన్న సంస్కృతులకు వీరు పెట్టింది పేరు.
వీరంతా టాప్ లో నిలిచారు. వారిలో రబ్బీ షెర్గిల్ . 2005లో చార్ట్ లో టాపర్ గా(Top Indian Folk Singers) ఉన్నారు. సూఫీ జానపద, పాశ్చాత్య సంగీతం మేళవించి పాడటంలో దిట్ట. భారతీయ సంగీత ప్రపంచంలో భిన్నమైన వాయిస్ ఆయనది.
పంజాబ్ కు సంబంధించి నిజమైన అర్బన్ బల్లా డీర్ గా గుర్తింపు పొందారు. రాక్ , పంజాబీ, బానీ, సూఫీ, వెస్ట్రన్ ను తన గొంతులో పలికించడం విశిష్టత. బాలీవుడ్ సినిమాల్లో తన గొంతు తో అలరించాడు. హీర్ , ఇష్తిహార్ , ఢిల్లీ వంటి పాటలతో అలరించాడు ఎక్కువగా.
నూరన్ సిస్టర్స్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వీరు ఇప్పటికే పేరు పొందారు. నూరన్ సోదరీమణులు పంజాబ్ లోని హోషియార్ పూర్ కు చెందిన భక్తి పూర్వక సూఫీ గాయకులుగా ఉన్నారు.
సుల్తానా నూరన్ , జ్యోతి నూరన్ గొంతుల్లోంచి వచ్చే ఏ పాటైనా అది ప్రాణప్రదం అవుతుంది. వీరు సూఫీ సంగీత విధ్వాంసుల కుటుంబానికి చెందిన వారు. కచేరీలు, ప్రదర్శనలతో కనిపిస్తారు.
2012లో వచ్చిన బాలీవుడ్ సినిమా సింగ్ ఈజ్ బ్లింగ్ లో తుంగ్ తుంగ్ నటనతో కీర్తి పొందారు. ఆనాటి నుంచి హైవే, సుల్తాన్ , దంగల్ వంటి చిత్రాలలో మరింత పాపులర్ అయ్యారు. వడాలి బ్రదర్స్ మోస్ట్ పాపులర్ . తోబుట్టువుల జంట. సూఫీ గాయకుల కుటుంబంలో ఐదవ తరానికి చెందిన వారు.
గుర్బానీ, గజల్ , కాఫీ , భజనలు ఆలాపిస్తారు. పంజాబ్ లోని గురు కి వడాలిలో నివసిస్తున్నారు. వీరి మధురమైన స్వరాలు పింజర్ , తను వెడ్స్ మను వంటి బాలీవుడ్ సినిమాలకు గాత్రాన్ని అందించారు.
మరో జానపద గాయని కల్పనా పటోవారీ. అస్సాం లోని బార్ పేట జిల్లాలో జన్మించింది. ఆమె దాదాపు 30 భాషల్లో పాడారు. తన తండ్రి ఆధ్వర్యంలో కమ్రూపియా , గోల్పోరియా సంగీతంలో శిక్షణ పొందారు. నాలుగేళ్ల వయస్సులో ప్రదర్శన ఇవ్వడంతో పాపులర్ అయ్యింది.
భోజ్ పురి సంగీతం ఆమెకు బలమైన షూట్. భారతీయ సంగీతానికి ఆమె చేసిన సహకారం అపూర్వమైనది. అనేక బాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. భారతీయ జానపద ప్రస్థానంలో విస్మరించని ఒకే ఒక్కడు పాపోన్ .
అద్భుతం అతడి గాత్రం. ఫోక్ ఫ్యూజన్ బ్యాండ్ వ్యవస్థాపకుడు. బాలీవుడ్ సంగీతానికి సహకారం అందించాడు. మంచి గాయకుడిగా పేరొందాడు.
రెడ్ బుల్ డాక్యుమెంటరీ హోమ్ టౌన్ హీరోస్ ద్వారా కీర్తి పొందాడు. జియోన్ క్యున్ , మెహ్ మెహ్ కే ధాగే , లాబోన్ కా కరో బార్ వంటి పాటలకు ప్రసిద్ది పొందాడు. వివిధ అంతర్జాతీయ ప్రదర్శనలో కీలక పాత్ర పోషించాడు.
ఇలా అరుణ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె గురించి చర్చించకుండా దేశంలోని జానపద సంగీత దిగ్గజాల గురించి చర్చించడం సాధ్యం కాదు. జైపూర్ కు చెందిన ఆమె హిందీ, తమిళం, తెలుగుతో సహా అనేక భారతీయ భాషల్లో పాడింది.
పలు సినిమాల్లో పాడిన పాటలు హిట్ గా నిలిచాయి. రింగా రింగా , చోలీ పీచే క్యా హై అనే పాటలతో మరింత పాపులర్ అయ్యారు ఇలా అరుణ్.
రఘు దీక్షిత్ దిగ్గజ జానపద గాయకుడు. ప్రపంచం నలుమూలల నుండి విభిన్న సంగీత శైలుల్ని ఆయన గొంతులో ప్రతిఫలించేలా చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కళాకారులను ఒకే చోటుకు చేర్చే పనిలో పడ్డాడు.
ఆయన ఆల్బమ్ యుకె లోని ఐట్యూన్స్ లో నెంబర్ వన్ గా నిలిచింది. మైసూర్ సే ఆయీ, ఖిడ్కీ, జగ్ చంగా తో పాపులర్ అయ్యాడు.
మాలిని అవస్థి ప్రముఖ జానపద గాయకురాలు. యూపీలోని కన్నౌజ్ కు చెందిన వారు. హిందీ, అవధి, బుందేల్ ఖండ్ , భోజ్ పురి, ఇతర భారతీయ భాషల్లో పాడారు. 2016లో పద్మశ్రీ అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో ప్రదర్శనలు కూడా ఇచ్చారు.
ఏజెంట్ వినోద్, దమ్ లగా కే హైషా వంటి బాలీవుడ్ చిత్రాలకు తన గాత్రాన్ని ఇచ్చారు.
మామ్ ఖాన్ మోస్ట్ పాపులర్ ఫోక్ సింగర్. జైసల్మేర్ లోని సట్టో అనే చిన్న ఊరు నుండి వచ్చాడు. రాజస్థాన్ లోని మంగిన్యార్ కమ్యూనిటీకి చెందిన వాడు. రాజస్థానీ జానపద సంగీతానికి ఆయన చేసిన కృషికి గాను ఫోక్ స్టార్ ఆఫ్ రాజస్థాన్ అని పిలువబడ్డాడు.
లక్ బై ఛాన్స్ , ఐ యామ్ , నో వన్ కిల్డ్ జెస్సికా వంటి బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించాడు.
ఇక ప్రహ్లాద్ సింగ్ టిపన్యా ప్రముఖ జనాపద కళాకారుడు. మధ్య ప్రదేశ్ లోని మాల్వాకు చెందిన గాయకుడు. కబీర్ భజనలను పాడారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించాడు. ప్రదర్శనలు ఇచ్చాడు.
Also Read : స్వతంత్ర మీడియా సంస్థల హవా