TPCC Mahesh Kumar : మరో సరికొత్త నిర్ణయం తీసుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మహేష్ ముందు పెద్ద సవాలే ఉంది...

TPCC Mahesh Kumar : రాష్ట్ర మంత్రులకు సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారానికి రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు విధి విధానాలను, మంత్రుల షెడ్యూల్‌ను రూపొందించాలని గాంధీ భవన్ సిబ్బందికి టీపీసీసీ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు. టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్(TPCC Mahesh Kumar) పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రులు ప్రతి వారంలో రెండుసార్లు గాంధీ భవన్ రావాలని ఆయన సూచించారు. ప్రతి బుధ, శుక్రవారాలలో ఒక్క మంత్రి.. గాంధీ భవన్‌కు రావాలని మహేష్ సూచించారు. వచ్చే శుక్రవారం నుంచి గాంధీ భవన్‌కు మంత్రుల రాక ప్రారంభంకానున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.

TPCC Mahesh Kumar Comment

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మహేష్ ముందు పెద్ద సవాలే ఉంది. త్వరలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తాము ప్రజా పాలనను అందిస్తున్నామని.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు కాంగ్రెస్ పాలనపై ప్రతిపక్ష బీఆర్‌‌ఎస్ పార్టీ నేతలు దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం మహేష్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌గా చెప్పుకోవచ్చు. సీనియర్ నేత మహేష్‌ కుమార్‌కు టీపీసీసీ చీఫ్ పదవి వరించింది. మహేష్‌కు నాలుగు దశాబ్ధాలుగా పైగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉంది. ఎలాంటి పదవులు ఆశించని వ్యక్తి ఆయన. అందరినీ కలుపుకుంటూ పోతూ అధిష్టానం తనకు అప్పగించిన పనులను చేసుకుంటూ వెళ్తుంటారు. టీపీసీసీ చీఫ్‌గా మహేష్ కుమార్‌ను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండటం.. ఈ మధ్య కాలంలో బీసీ నినాదం ఎక్కువ వినిపిస్తుండటంతో.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ పదవి దక్కింది.

Also Read : Balineni Resign : వైసీపీకి రాజీనామా చేసిన కీలక నేత మాజీ మంత్రి బాలినేని

Leave A Reply

Your Email Id will not be published!