Travis Head IPL : ‘ట్రావిస్’ హైదరాబాద్ వశం
నువ్వా నేనా అన్న రీతిలో పోటీ
Travis Head IPL : దుబాయ్ – ఐపీఎల్ 2024 కు సంబంధించిన వేలం పాటలో ఆటగాళ్లను చేజిక్కించు కునేందుకు ఆయా జట్ల యాజమాన్యాలు పోటీ పడ్డాయి. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగింది. భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో దుమ్ము రేపాడు ఆసిస్ స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్. ప్రత్యర్థి జట్ల బౌలర్లకు చుక్కలు చూపించారు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు.
Travis Head IPL Team
దీంతో ఈసారి ఐపీఎల్ వేలం పాటలోకి వచ్చాడు. బిడ్డింగ్ చివరి దాకా ఆసక్తికరంగా సాగింది. నువ్వా నేనా అన్న రీతిలో జరిగినా చివరకు కావ్య మారన్ సీఇవోగా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది ట్రావిస్ హెడ్ ను.
అయితే ఈ ఐపీఎల్ వేలం పాటలోకి బేస్ (కనీస ) ధర రూ. 2 కోట్లతో ఎంట్రీ ఇచ్చాడు. ఇతడిని చేజిక్కించు కునేందుకు రెండు యాజమాన్యాలు పోటీ పడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడింది. కానీ చివరకు పై చేయి సాధించింది సన్ రైజర్స్ హైదరాబాద్ . ఏకంగా ట్రావిస్ హెడ్(Travis Head) ను రూ. 6.80 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇదే యాజమాన్యం ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు కొనుగోలు చేసింది ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ ను. ఏకంగా రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేయడం విస్తు పోయేలా చేసింది.
Also Read : Rovman Powell IPL : పావెల్ పంట పండింది