P Venktrami Reddy : ఒకప్పటి సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి (P Venktrami Reddy )బేషరతుగా హైకోర్టుకు సారీ చెప్పారు. కోర్టు ధిక్కారణ వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయన ఆద్యంతమూ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారు.
అంతే కాదు సీఎం కాళ్లు కూడా మొక్కారు కలెక్టర్ గా ఉన్న సమయంలో. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలా చేయడంపై సర్వత్రా చర్చకు దారి తీసింది.
ఇదే సమయంలో రైతులపై నోరు పారేసుకున్నారు. ఆపై కోర్టులపై కూడా సంచలన ఆరోపణలు చేశారు. వెంకట్రామిరెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
దీంతో రెడ్డిపై కోర్టు ధిక్కరణ కింద పిటిషన్ దాఖలైంది హైకోర్టులో. ఆపై తాను అనలేదని, ఎవరో కావాలని ఎడిట్ చేశారంటూ తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు.
చివరకు శిక్ష తప్పదని తేలడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి(P Venktrami Reddy )హైకోర్టుకు లిఖిత పూర్వకంగా క్షమాపణ చెప్పారు.
తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. కలెక్టర్ గా ఉన్న సమయంలో వరి సాగు చేయొద్దంటూ , వ్యాపారులు వరి విత్తనాలు కూడా అమ్మొద్దంటూ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. అప్పట్లో కలకలం రేపింది.
తాను అధికార పార్టీకి అనుంగు అనుచరుడిగా వ్యవహరించారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఎవరినీ ఖాతరు చేయలేదు. మల్లన్న సాగర్ బాధితులు ఆయనపై ఫైర్ అయ్యారు.
రియల్ ఎస్టేట్ దందాకు సపోర్ట్ చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఈ తరుణంలో ఉన్నట్టుండి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
Also Read : మోదీపై యుద్దం సీఎం సన్నద్ధం