#TRS : రోడ్డెక్కిన టీఆర్ ఎస్ పార్టీ నేతలు

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సమయంలో రెండు వర్గాల మధ్య కుమ్ములాట

తెలంగాణలో క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న టీఆర్ ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. హైదరాబాద్ లోని రాంకోఠిలోని రూబీ గార్డెన్స్ లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక కోసం తెరాస సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, మహమద్ ఆలీ ఇద్దరూ పాల్గొన్నారు. వీరితో పాటు గోషామహల్ నియోజకవర్గ నేతలు పలువురు పాల్గొన్నారు. ఆ ఏరియాలో కీలక నేతగా ఉన్న ఆర్వీ మహేందర్ కుమార్ ను వేదికపై కి పిలవకపోవడంతో అక్కడ ఘర్షణ మొదలైంది. మా ప్రాంతానికి వచ్చి.. మా నేతను అగౌరవపరిచారని స్థానిక పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సమావేశం దారి మళ్లడంతో మంత్రి మహమద్ ఆలీ సర్ది చెప్పి శాంతింప చేశారు. తర్వాత వాళ్లు చెప్పాల్సింది వేదికపై చెప్పి..ఇద్దరు మంత్రులు వెళ్లిపోయారు.

వారు వెళ్లిన తర్వాత మళ్లీ ఘర్షణ మొదలైంది. అది ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయికి చేరి కొట్టుకోవడం వరకు వెళ్లింది. అనంతరం నారాయణగూడ పోలీసు స్టేషన్ లో ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.

టీఆర్ ఎస్ నాయకులు ఇలా రోడ్డెక్కడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొట్టుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్ చల్ చేయడమే కాదు..వైరల్ కూడా మారాయి. పార్టీ పరువు పోయిందంటు సీనియర్లు వ్యాఖ్యానించడం ఇక్కడ గమనార్హం.

Leave A Reply

Your Email Id will not be published!