Johnny Depp Lawyer : నిజం నిలిచింది న్యాయం గెలిచింది

జానీ డెప్ లాయ‌ర్ కామిల్లె వాస్కెజ్

Johnny Depp Lawyer : యావ‌త్ ప్ర‌పంచం ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూసింది దిగ్గ‌జ హాలీవుడ్ న‌టీన‌టుల ప‌రువు న‌ష్టం దావా కేసుకు సంబంధించి వ‌ర్జీనియా కోర్టు ఇచ్చే తీర్పు కోసం. ఆ క్ష‌ణాలు రానే వ‌చ్చాయి. ఇరువురి న‌టుల వాదన‌లు విన్న జ్యూరీ కీల‌క నిర్ణ‌యం ప్ర‌క‌టించింది.

ఈ మేర‌కు ఏడుగురు స‌భ్యుల‌తో కూడిన జ్యూరీ సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. జానీ డెప్ కు అనుకూలంగా తీర్పు వెలువ‌రించింది. ఆయ‌నపై మాజీ భార్య అంబ‌ర్ హార్డీ చేసిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని తేల్చింది.

జానీ డెప్ ఎలాంటి లైంగిక నేరానికి, హింస‌కు పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ప‌నిలో ప‌నిగా కోలుకోలేని షాక్ ఇచ్చింది. $15 మిలియ‌న్ డాల‌ర్లు న‌ష్ట ప‌రిహారంగా జానీ డెప్ కు ఇవ్వాల‌ని తీర్పు చెప్పింది.

ఈ మొత్తం వ్య‌వ‌హారంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది మాత్రం జానీ డెప్ కు లాయ‌ర్(Johnny Depp Lawyer) గా వ్య‌వ‌హ‌రించిన కామిల్లె వాస్క్వేజ్ . ఆమె తీర్పు వెలువ‌డిన వెంట‌నే త‌న ఆనందాన్ని పంచుకున్నారు.

తాను మొద‌టి నుంచి చెబుతూనే వ‌చ్చాన‌ని అదే ఇవాళ జ్యూరీ తీర్పుతో నిజ‌మ‌ని తేలింద‌ని చెప్పారు. త‌న క్ల‌యింట్ హాలీవుడ్ హీరో జానీ డెప్ నిర్దోషి

అని నిరూపించ‌డంలో తాను విజ‌యం సాధించాన‌ని తెలిపారు.

ఇది త‌న కెరీర్ లో గొప్ప రోజుగా నిలిచి పోతుంద‌ని ఆమె పేర్కొంది. ఒక ర‌కంగా చెప్పాలంటే నిజం నిలిచింది న్యాయం గెలిచింద‌ని ఆమె వ్యాఖ్యానించింది. ప్ర‌స్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేశాయి. కామిల్లె వాస్క్వెజ్ ఇప్ప‌టికే మోస్ట్ పాపుల‌ర్ లాయ‌ర్(Johnny Depp Lawyer) గా పేరొందారు. ఈ

సంద‌ర్బంగా త‌న ఆనందాన్ని, ఉద్వేగాన్ని స‌హ ఉద్యోగుల‌తో పంచుకున్నారు కూడా.

జ్యూరీకి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు. ఇదిలా ఉండ‌గా కామిల్లె వాస్క్వేజ్ ఇప్పుడు వ‌ర‌ల్డ్ వైడ్ గా

సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారారు.

ఎందుకంటే న్యాయం నిలిచే ఉంద‌ని తెలియ చేసేందుకు ఇది ఒక అవ‌కాశంగా నిలిచేలా చేయ‌డంలో ఆమె స‌క్సెస్ అయ్యారు. ఎంతో

మందికి ఇది ఊర‌ట‌ను క‌లిగించే తీర్పుగా మిగిలి పోతుంది.

కామిల్లె ఎన్నో కేసుల‌ను వాదించి గెలుపొందారు. ఇది కూడా అందులో ఒక‌టిగా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఒక ర‌కంగా మ‌హిళా లోకానికి

కామిల్లె సాధించిన విజ‌యం ఓ స్పూర్తి గా నిలుస్తుంది.

Also Read : జ్యూరీ తీర్పు మరో జీవితాన్ని ఇచ్చింది

Leave A Reply

Your Email Id will not be published!