TS EAMCET Results : ఎంసెట్ లో ఆంధ్రా విద్యార్థుల హ‌వా

టాప్ 3 ర్యాంకుల్లో స‌త్తా చాటిన స్టూడెంట్స్

TS EAMCET Results : ఆంధ్ర విద్యార్థులు స‌త్తా చాటారు. గురువారం తెలంగాణ ఎంసెట్ 2023 ఫ‌లితాలు(TS EAMCET Results) వెల్ల‌డ‌య్యాయి. ఈ రిజ‌ల్ట్స్ ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేశారు. విచిత్రం ఏమిటంటే మొద‌టి మూడు ర్యాంకుల్లో ఏపీకి చెందిన స్టూడెంట్స్ టాప్ లో నిలిచారు. ఇంజ‌నీరింగ్ విభాగంలో ఏపీ లోని విశాఖ ప‌ట్ట‌ణంకు చెందిన విద్యార్థి అనిరుధ్ స‌న‌ప‌ల్ల 158.89 మార్కులు సాధించి టాప్ లో నిలిచాడు. గుంటూరుకు చెందిన విద్యార్థి మ‌నింద‌ర్ రెడ్డి 156.59 మార్కులు సాధించి రెండో ర్యాంకు సాధించాడు.

ఇక మూడో ర్యాంక్ సైతం ఏపీకి వెళ్లింది. కృష్ణా జిల్లా నందిగామ‌కు చెందిన చ‌ల్లా ర‌మేష్ 156.94 మార్కులు సాధించాడు. నాల్గ‌వ ర్యాంకును తెలంగాణ‌లోని కొండాపూర్ కు చెందిన అభినిత్ మంజేటి సాధించాడు. 156.58 మార్కులు వ‌చ్చాయి. ఐద‌వ ర్యాంక్ సైతం ఏపీకి వెళ్లింది. తాడిప‌త్రికి చెందిన ప్ర‌మోద్ కుమార్ కు ద‌క్కింది.

అగ్రిక‌ల్చ‌ర్, ఫార్మ‌సీలో ఈస్ట్ గోదావ‌రికి చెందిన బురుగు ప‌ల్లి స‌త్య టాప్ ర్యాంక్ సాధించాడు. చీరాల‌కు చెందిన వెంక‌ట తేజ రెండ‌వ ర్యాంకు పొందాడు. మూడో ర్యాంకు స‌ఫ‌ల్ లక్ష్మి కైవ‌సం చేసుకుంది. ఆమె రంగారెడ్డికి చెందిన విద్యార్థి. నాల్గో ర్యాంక్ ను తెనాలికి చెందిన కార్తికేయ రెడ్డి , శ్రీ‌కాకుళం కు చెందిన బోర వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి ఐదో ర్యాంకు సాధించాడు.

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ఈసారి అబ్బాయిలు హవా చాటారు. ఇంజనీరింగ్‌, అగ్రకల్చర్ స్ట్రీమ్‌లలో టాప్‌ ర్యాంకులన్నీ అబ్బాయిలే సాధించారు.రానున్న రెండు మూడు రోజుల్లో అడ్మిషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి సబిత వెల్లడించారు.

Also Read : TTD Chairman

 

Leave A Reply

Your Email Id will not be published!