TSPSC Chairman : పైర‌వీలు వ‌ద్దు ప్ర‌తిభ ముద్దు

టీఎస్పీఎస్సీ చైర్మ‌న్ బిజీఆర్

TSPSC Chairman : తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న 80 వేల 39 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్న‌ట్లు అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించారు సీఎం కేసీఆర్. ఇక ప్ర‌క‌టించిన నాటి నుంచే అన్ని పోస్టుల‌కు సంబంధించి నోటిఫికేష‌న్లు జారీ చేస్తార‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించి ఇప్ప‌టికే ఎక్క‌డా లేని రీతిలో 25 ల‌క్ష‌ల మంది తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ లో న‌మోదు చేసుకున్నారు. మొత్తంగా రాష్ట్రంలో 50 ల‌క్ష‌ల మందికి పైగా నిరుద్యోగులు జాబ్స్(TSPSC Chairman) కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ త‌రుణంలో అంద‌రి ఫోక‌స్ ఇప్పుడు టీఎస్పీఎస్సీ(TSPSC Chairman) పై ప‌డింది. ఆయ‌న ఉద్యోగార్థుల కోసం ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌తిభ‌ను న‌మ్ముకోవాల‌ని పైరవీలు చేయొద్దంటూ కోరారు. పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌న్నారు.

ఒత్తిడి లేకుండా ప‌రీక్ష‌ల‌కు సిద్దం కావాల‌ని సూచించారు. పోటీ ప‌రీక్ష‌ల‌కు ఫీజులు పెంచ‌డం లేద‌న్నారు. భ‌విష్య‌త్తులో కూడా పెంచ‌ది లేద‌ని స్ప‌ష్టం చేశారు. సిల‌బ‌స్ కూడా మార్చ‌బోమ‌న్నారు. ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు సైతం లేఖ‌లు రాశామ‌న్నారు.

కోర్టుల జోలికి వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌గా నోటిఫికేష‌న్లు జారీ చేస్తామ‌న్నారు. ఒక వేళ 30 వేల లోపు ఉంటే ఆన్ లైన్ లో ప‌రీక్ష పెడ‌తామ‌న్నారు. సాంకేతిక‌త‌ను వాడుకుని త్వ‌ర‌గా జాబ్స్ భ‌ర్తీ చేస్తామ‌న్నారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ చెప్పే పైర‌వీకారులు చెబితే న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించారు. ఏవైనా అభ్యంత‌రాలుంటే స్వీక‌రించి స‌రిదిద్దే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

ఇక ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విధంగా అన్ని వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్లు, వ‌యో ప‌రిమితి అన్నింటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని నోటిఫికేష‌న్లు విడుద‌ల చేసేందుకు టీస్పీఎస్సీ స‌న్న‌ద్దం అవుతోంది.

Also Read : 10 ఏళ్ల‌కు వ‌యో ప‌రిమితి పెంపు

Leave A Reply

Your Email Id will not be published!