TSRTC TTD : శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
దర్శనం టికెట్లు బస్సుల్లోనే పొందే చాన్స్
TSRTC TTD : తిరుమల శ్రీవారిని దర్శించు కోవాలని అనుకునే భక్తులకు ఖుష్ కబర్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC TTD). ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి ప్రతి రోజూ దర్శనం చేసుకునే సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానం, టీఎస్ఆర్టీసీ సంయుక్తంగా ఒప్పందం చేసుకున్నాయి.
ఇందులో భాగంగా ప్రతి రోజూ దర్శనానికి గాను టికెట్లను ఆన్ లైన్ లో కానీ ఆఫ్ లైన్ లో కానీ పొందే వీలు కల్పించింది. బస్ టికెట్ల రిజర్వేషన్ సమయంలోనే దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
ఈ సదుపాయం ఇవాల్టి నుంచే అమలులోకి రానుంది. ఇక తిరుమలకు వెళ్లాలని అనుకునే భక్తులు ఈ అద్భుతమైన చాన్స్ మిస్ చేసుకోవద్దంటూ కోరారు చైర్మన్, ఎండీ. తెలంగాణ నుంచి తిరుమలకు వెళ్లాలని అనుకునే వాళ్లకు ఇది మంచి అవకాశం.
తిరుమలకు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టికెట్టు కూడా బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది. టీఎస్ఆర్టీసీతో పాటు ఆర్టీసీ సంస్థ అధీకృత డీలర్ ద్వారా రిజర్వు చేసుకునే సదుపాయం ఏర్పాటు చేసింది.
బస్ టికెట్ తో పాటే దర్శనం టికెట్ ను కూడా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే ఈ సదుపాయం వర్తిస్తుంది. లేక పోతే కష్టం. టిఎస్ఆర్టీసీఆన్లైన్.
ఇన్ వెబ్ సైట్ ద్వారా క్లిక్ చేసి పొందవచ్చు. అయితే ఏడు రోజుల ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుందని సంస్థ ప్రకటించింది.
Also Read : తిరుమలకు పెరుగుతున్న ఆదాయం