TSRTC Charges : ఈనెల 9 నుంచి ఆర్టీసీ ఛార్జీల మోత మోగనుంది. ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు డీజిల్ పై రూ. 2, పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులో ఒక్కో ప్రయాణికుడి నుంచి వసూలు చేయనున్నారు.
ఇక ఎక్స్ ప్రెస్ , డీలక్స్ , సూపర్ లగ్జరీ , సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్ , డీలక్స్ , అన్ని ఏసీ సర్వీసుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ. 5 పెంచుతున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ (TSRTC Charges )వెల్లడించారు.
కాగా సామాన్య ప్రజలు, తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకూడదని టీఎస్ఆర్టీసీ(TSRTC Charges )నిర్ణయించిందన్నారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస ధర రూ. 10 కొనసాగుతుందని స్పష్టం చేశారు సజ్జనార్.
ఈ సందర్భంగా ఎందుకు పెంచాల్సి వచ్చిందనే దానిపై కారణాలు తెలిపారు ఎండీ. డీజిల్ ఎసస్ వసూలు చేసేందుకు గాను ప్రతి రోజూ ఆర్టీసీ 6 లక్షల లీటర్ల హెచ్ఎస్డీ ఆయిల్ వినియోగిస్తున్నట్లు వెల్లడించారు.
ఇటీవల కాలంలో ఈ ఆయిల్ ధర అసాధారణంగా పెరిగింది. 2021 డిసెంబర్ లో , ఆయిల్ ధర లీటర్ కు రూ. 83గా ఉంది. ప్రస్తుతం అది లీటర్ కు రూ. 118కి పెరిగింది.
దీంతో కార్పొరేషన్ కు ఇంధన వ్యయం భారీగా పెరిగింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఆయిల్ ధరల కారణంగా అదనపు ఖర్చులను నిర్వహించేందుకు ఆర్టీసీ ప్రయత్నిస్తున్నా చాలడం లేదని తెలిపారు.
దీంతో సెస్ విధించడం కార్పొరేషన్ కు అనివార్యమైందని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు ఎండీ.
Also Read : అజీమ్ ప్రేమ్ జీ ఆదర్శ ప్రాయుడు