TTD Board : టీటీడీ ఉద్యోగులకు ఖుష్ కబర్
జీయర్ మఠాలకు నిధులు పెంపు
TTD Board : తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మంగళవారం టీటీడీ భవనంలో పాలక మండలి సమావేశం జరిగింది. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీలో(TTD) పని చేస్తున్న ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఇళ్ల స్థలాలతో పాటు వేతనాలు కూడా పెంచాలని నిర్ణయించింది. ఈనెల 28న 3,518 మందికి ఇంటి స్థలాలు ఇవ్వాలని స్పష్టం చేసింది.
TTD Board Good News
ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వారందరి వేతనాలను కూడా పెంచాలని సూచించింది పాలక మండలి. అంతే కాకుండా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం రూ. 85 కోట్ల ఖర్చుతో అదనంగా 350 ఎకరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
అంతే కాకుండా పారిశుధ్య కార్మికులు, సిబ్బందితో పాటు ఒప్పంద పద్దతిన పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి వేతనాలు కూడా పెంచేందుకు పాలకమండలి అనుమతి ఇచ్చింది. ఇక పోటు కార్మికులకు వేతనాలు రూ. 28 వేల నుండి రూ. 38 వేలకు పెంచాలని నిర్ణయించింది. వాహనం బేరర్లు, ఉగ్రాణం కార్మికులను నైపుణ్యం కలిగిన కార్మికులుగా గుర్తించి జీతాలు పెంచేందుకు ఓకే చెప్పింది.
ఫిబ్రవరిలో 2 రోజుల పాటు దేశ వ్యాప్తంగా పీఠాధిపతులను ఆహ్వానించి సదస్సు నిర్వహించాలని పాలక మండలి సమ్మతి తెలిపింది. ఇక కళ్యాణకట్టలో పని చేసే బార్బర్లకు వేతనాలు కనీసం రూ.20 వేలు ఇవ్వాలని, పాత సత్రాలు తొలగించి కొత్తగా గెస్ట్ హౌస్ లు నిర్మించాలని నిర్ణయించింది. జార్ఖండ్ రాష్ట్రంలో అక్కడి సర్కార్ ఇచ్చిన 100 ఎకరాల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించేందుకు ఓకే చెప్పింది పాలక మండలి.
శ్రీవారి ఆలయ పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాలకు ప్రతి ఏటా ఇచ్చే ప్యాకేజీకి మరో కోటి రూపాయలు పెంచేందుకు సమ్మతించింది టీటీడీ.
Also Read : Deepa Das Munshi : బీఆర్ఎస్ కు అంత సీన్ లేదు