TTD Calenders Books : టీటీడీ క్యాలెండ‌ర్లు..పుస్త‌కాలు విడుద‌ల

రిలీజ్ చేసిన చైర్మ‌న్ భూమ‌న‌..ఈవో ధ‌ర్మారెడ్డి

TTD Calenders Books : తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఆద్వ‌ర్యంలో తొలిసారిగా ముద్రించిన స్థానిక ఆలయ క్యాలెండర్‌లతో పాటు గోవింద కోటి, భగవద్గీత పుస్తకాలను పాల‌క మండ‌లి చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి , ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి విడుద‌ల చేశారు.

TTD Calenders Books Released

మంగళవారం తిరుమల లోని అన్నమయ్య భవనంలో ట్రస్టుబోర్డు సమావేశం జ‌రిగింది. మీటింగ్ అనంత‌రం 200 పేజీలతో కూడిన రూ.111 ధర కలిగిన గోవింద కోటి పుస్తకాన్ని రిలీజ్ చేశారు. హిందూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో భాగంగా 25 ఏళ్లలోపు యువకులను దైవ నామాలు రాయడం అలవాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు టీటీడీ ఈ అపూర్వమైన ఆధ్యాత్మిక విన్యాసాన్ని ప్రవేశపెట్టింది.

10,01,116 గోవింద నామాలను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఆ వ్యక్తికి TTD ద్వారా బ్రేక్ దర్శన సౌకర్యం కల్పిస్తారు. కోటి గోవింద నామాలు పూర్తి చేసిన వారికి టీటీడీ బ్రేక్ దర్శనంతో పాటు మొత్తం ఐదుగురికి వసతి కల్పించ‌నున్న‌ట్లు తెలిపారు చైర్మ‌న్ భూమ‌న‌.

చిన్నారులు, యువత సౌకర్యార్థం 20 పేజీల భగవద్గీత సులభతరమైన ఐదు భాషల్లో లక్ష కాపీలను టీటీడీ తీసుకొచ్చింది.

అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం, నాగులాపురంలోని శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం, శ్రీ నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని మూలమూర్తి, ఉత్సవ మూర్తిలతో కూడిన 13 వేల స్థానిక ఆలయ క్యాలెండర్‌లను టిటిడి మొదటిసారిగా విడుదల చేసింది.

Also Read : TTD Board : టీటీడీ ఉద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!