PM Modi Record : చ‌రిత్ర సృష్టించిన న‌రేంద్ర మోదీ

ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ ఛాన‌ల్

PM Modi Record : న్యూఢిల్లీ – భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ చ‌రిత్ర సృష్టించారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూయ‌ర్స్ క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. గూగుల్ యూట్యూబ్ లో ఏకంగా 2 కోట్ల మంది స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను దాటిన తొలి గ్లోబ‌ల్ లీడ‌ర్ గా మోదీ నిలిచారు. ఆ త‌ర్వాతి స్థానంలో ఉక్రేనియ‌న్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ నిలిచారు. మోదీ యూట్యూబ్ ఛాన‌ల్ దూసుకు పోతోంది ఆద‌ర‌ణ‌లో.

PM Modi Record Followers

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న నాయ‌కుల కంటే ముందంజ‌లో కొన‌సాగుతున్నారు న‌రేంద్ర మోదీ. మోదీ యూట్యూబ్ ఛాన‌ల్ ను జ‌నం ఎక్కువ‌గా ఆద‌రిస్తున్నారు. అంతే కాదు సోష‌ల్ మీడియాలో నిత్యం ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నారు ప్ర‌ధాన మంత్రి.

దేశానికి సంబంధించి ఏ నాయ‌కుడు ఇన్ని కోట్ల మందిని క‌లిగి లేక పోవ‌డం విశేషం. మోదీ(PM Modi) త‌ర్వాత అత్యంత జ‌నాద‌ర‌ణ క‌లిగిన నేత‌గా బ్రెజిలియ‌న్ మాజీ చీఫ్ జైర్ బోల్స‌నోరా ఉన్నారు. ఆయ‌న‌కు కేవ‌లం 64 ల‌క్ష‌ల మంది స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను మాత్ర‌మే ఉండ‌డం విశేషం.

మార్నింగ్ క‌న్స‌ల్ట్ వంటి అనేక గ్లోబ‌ల్ స‌ర్వే కంపెనీలు న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీని అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన ప్ర‌పంచ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

Also Read : TTD Calenders Books : టీటీడీ క్యాలెండ‌ర్లు..పుస్త‌కాలు విడుద‌ల

Leave A Reply

Your Email Id will not be published!