TTD Cancels : బ్రహ్మోత్సవాలలో సామాన్యులకే దర్శనం
ప్రివిలైజ్డ్ దర్శనాలకు అనుమతి లేదు
TTD Cancels : తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నానా తంటాలు పడుతున్న వారందరికీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. గతంలో రెండేళ్లుగా కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలను నిర్వహించ లేదు తిరుమల తిరుపతి దేవస్థానం.
తాజాగా కరోనా తగ్గుముఖం పడుతుండడంతో కీలక నిర్ణయం తీసుకుంది పాలకమండలి. సుదీర్ఘ కాలం తర్వాత స్వామి వారి బ్రహ్మోత్సవ వాహన సేవలను మాడ వీధుల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లలో మునిగి పోయింది.
ఈనెల 26 నుంచి వచ్చే అక్టోబర్ 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున తరలి రావచ్చని అంచనా వేస్తోంది టీటీడీ.
గత కొంత కాలంగా ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తూ వచ్చారు. సర్వ దర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
ఉత్సవాల రోజులలో భక్తులు ఎక్కువ సంఖ్యలో రానుండడంతో ఇప్పటి వరకు అమలు చేస్తున్న వీఐపీ బ్రేక్ దర్శనాలు, వృద్దులు, దివ్యాంగులు, చంటి పిల్లల పేరెంట్స్ కు ప్రత్యేక దర్శనం , తదితర ప్రివిలైజ్జ్ దర్శనాలను రద్దు చేసినట్లు ప్రకటించింది టీటీడీ(TTD Cancels).
ఆర్జిత సేవలు, రూ. 300 దర్శన టికెట్లతో పాటు శ్రీవాణి శ్రీవాణి ట్రస్ట్ దాతలు , ఇతర ట్రస్ట్ ల దాతలకు దర్శన టికెట్లను రద్దు చేసినట్లు తెలిపింది.
ఇందులో భాగంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుందని స్పష్టం చేసింది. మరో వైపు భక్తుల రద్దీ ఎప్పటి లాగానే కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసింది టీటీడీ.
Also Read : బెంగళూరులో ట్రాక్టర్లపై ఆఫీసులకు టెక్కీలు