TTD Chairman : శ్రీవారి అనుగ్రహంతో వర్షాలు కురవాలి

టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి

TTD Chairman : ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం కారీరిష్టి-వరుణ జపం- పర్జన్యశాంతి హోమం నిర్వహించామని, శ్రీవారి దయతో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థించామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో ఐదు రోజుల పాటు జరిగిన యాగాలు మహా పూర్ణాహుతితో ముగిశాయి.

TTD Chairman Words

ఈ కార్యక్రమంలో ఈవో ఎవి.ధర్మారెడ్డితో కలిసి టీటీడీ ఛైర్మన్(Bhumana Karunakar Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడారు. వరుణ దేవుని ఆశీస్సులు కోరుతూ 32 మంది ఋత్వికులు ధర్మగిరిలో ఎంతో నిష్టగా, అత్యంత అంకిత భావంతో యాగాలు నిర్వహించారని చెప్పారు.

అనంతరం ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కె.ఎస్.ఎస్.అవధాని కారీరిష్టి-వరుణజప-పర్జన్యశాంతి మంత్రాలను పఠించి అందరితో పలికించారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, వైఖానస ఆగమసలహాదారు మోహ‌న రంగాచార్యులు, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, విజీఓలు శ్రీ బాలిరెడ్డి, శ్రీ గిరిధర్ రావు, ధర్మగిరి వేద పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Also Read : Nara Lokesh : జ‌గ‌న్ పాల‌నలో జ‌నం ఆగ‌మాగం

Leave A Reply

Your Email Id will not be published!