TTD Darshan Tickets : 18న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లు

ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

TTD Darshan Tickets : తిరుమ‌ల – కోట్లాది మంది భ‌క్తుల‌కు తీపి క‌బురు చెప్పింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ). వ‌చ్చే ఏడాది 2024 జ‌న‌వ‌రి నెలకు సంబంధించి టికెట్ల కోటాను రిలీజ్ చేసింది. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చే భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేలా టీటీడీ(TTD) షెడ్యూల్ త‌యారు చేసింది. ఇందుకు గాను జ‌న‌వ‌రి నెల‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్ల కోటాను ప్ర‌క‌టించింది.

TTD Darshan Tickets Will be Released

సుప్ర‌భాతం, తోమాల , అర్చ‌న‌, అష్ట ద‌ళ పాద ప‌ద్మార్చ‌న‌, ఆర్జిత సేవ‌ల ఆన్ లైన్ ల‌క్కీ డిప్ కోసం అక్టోబ‌ర్ 18న ఉద‌యం 10 గంట‌ల నుండి 20 వ తేదీ ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు న‌మోదు చేసుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం.

ఇదిలా ఉండ‌గా ల‌క్కీ డిప్ లో టికెట్లు పొందిన భ‌క్తులు అక్టోబ‌ర్ 22వ తేదీ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల లోపు రుసుము చెల్లించి వాటిని ఖ‌రారు చేసుకోవాల‌ని భ‌క్తుల‌కు సూచించింది. స్వామి వారికి సంబంధించి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ.

వ‌ర్చువ‌ల్ సేవా టికెట్లను అక్టోబర్ 21వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఆంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు, శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం, గ‌దుల కోటాను అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులకు ద‌ర్శ‌న టోకెన్ల కోటాను అక్టోబర్ 23వ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.

ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం రూ.300 టికెట్ల కోటాను అక్టోబర్ 24వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమ‌ల‌, తిరుప‌తిలో వ‌స‌తి గ‌దుల బుకింగ్‌ అక్టోబర్ 25వ తేదీ ఉద‌యం 10 గంటలకు విడుదల చేస్తారు.

డిసెంబరు నెలకు సంబంధించి అక్టోబరు 27న ఉదయం 10 గంటలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవ కోటాను, ఉదయం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను విడుదల చేస్తారు.

భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది టీటీడీ.

Also Read : AP CM YS Jagan : ప‌వ‌న్ పై జ‌గ‌న్ సెటైర్

Leave A Reply

Your Email Id will not be published!