TTD EO Dharma Reddy : టీటీడీ వెబ్‌సైట్ ఆధునీక‌ర‌ణ‌

ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ ఏవీ ధ‌ర్మా రెడ్డి

TTD EO Dharma Reddy : తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) కార్య నిర్వ‌హ‌ణ అధికారి ఏవీ ధ‌ర్మా రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తిరుప‌తి, ఇత‌ర ప్రాంతాల్లో గ‌ల టీటీడీ స్థానిక ఆల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలకు విస్తృత ప్రాచుర్యం క‌ల్పించే దిశ‌గా అన్ని వివ‌రాల‌తో వెబ్‌సైట్‌ను ఆధునీక‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగిందని వెల్ల‌డించారు. తిరుప‌తిలోని టీటీడీ(TTD) ప‌రిపాల‌నా భ‌వ‌నంలో స్థానిక ఆల‌యాల‌పై ఈవో స‌మీక్ష చేప‌ట్టారు. అనంత‌రం ఏవీ ధ‌ర్మా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

TTD EO Dharma Reddy Comment

టీటీడీలో 60కి పైగా స్థానిక ఆల‌యాలు, అనుబంధ‌ ఆల‌యాలు ఉన్నాయ‌ని తెలిపారు. వీటికి సంబంధించిన స్థ‌ల పురాణం, ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న వేళ‌లు, ఇత‌ర సౌక‌ర్యాల‌ను వెబ్‌సైట్ ద్వారా భ‌క్తుల‌కు తెలియ జేయాల‌ని జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మంను కోరారు.

గ‌తంలో క‌ర‌ప‌త్రాలు, విభిన్న ప‌ద్ధ‌తుల్లో ప్ర‌చార సామ‌గ్రిని భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచే వార‌మ‌ని, ఇటీవ‌ల డిజిట‌ల్ మీడియా వైపు ఎక్కువ‌గా మొగ్గు చూపుతున్న నేప‌థ్యంలో వెబ్‌సైట్‌ను ఆధునీక‌రించాల‌ని సూచించారు.

ఎస్వీబీసీ ద్వారా ఆల‌య విశిష్ట‌త‌కు సంబంధించి స్వ‌ల్ప వ్య‌వ‌ధిగ‌ల వీడియో క్లిప్‌లు రూపొందించి వివిధ మాధ్య‌మాల ద్వారా జ‌న బాహుళ్యంలోకి తీసుకెళ్లాల‌ని కోరారు. త‌ద్వారా ఎక్కువ‌మందికి ఆల‌యాల స‌మాచారం తెలుస్తుంద‌ని అభిప్రాయ ప‌డ్డారు ఏవీ ధ‌ర్మా రెడ్డి.

Also Read : Chandra Babu Case : బాబుకు ఊర‌ట‌ విచార‌ణ వాయిదా

Leave A Reply

Your Email Id will not be published!