TTD : తిరుమలలో అన్నప్రసాదాల తయారీ పై కీలక చర్యలు తీసుకుంటున్న టీటీడీ
అన్నప్రసాదం మందం కూడా పెరిగింది...
TTD : కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల స్వామికి నివేదించే అన్నప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్గానిక్ బియ్యం వినియోగాన్ని నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. గతంలో అన్నప్రసాదం తయారీలో ఉపయోగించే బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించారు. గత కొన్నేళ్లుగా అన్నప్రసాదం నాణ్యత లోపించిందని భక్తుల నుంచి టీటీడీకి పలు ఫిర్యాదులు అందాయి.
TTD Updates
భక్తుల ఫిర్యాదుల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదాల తయారీకి సాధారణ బియ్యాన్నే వినియోగించాలని నిర్ణయించింది. అన్నప్రసాదం మందం కూడా పెరిగింది. కరోనా సమయంలో టీటీడీ అన్నప్రసాద దిట్టాన్ని తగ్గించిన సంగతి తెలిసిందే. సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు టీటీడీ ప్రసాదం పెంచలేదు. ఈ క్రమంలో సాధారణ బియ్యాన్ని వాడే స్థాయి నుంచి అన్నప్రసాదాన్ని పెంచాలని టీటీడీ నిర్ణయించింది.
Also Read : Home Minister Anitha : విశాఖ సెంట్రల్ జైలును సందర్శించిన ఏపీ హోమ్ మంత్రి