TTD News : టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సర్కార్ శుభవార్త

ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం

TTD News : టీటీడీ ఉద్యోగులకు బోర్డు శుభవార్త తెలియజేసింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9 వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ టీటీడీ బోర్డు డైరెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయం టీటీడీ(TTD) నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. టీటీడీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గాలిగోపురం, ఆంజనేయ స్వామి విగ్రహం, మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇక నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం. తాళ్లపాకల్లో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం. శ్రీవారి ఆలయంలోని జయ విజయల వద్ద ఉన్న తలుపులకు 1.69 కోట్లతో బంగారు తాపడం. రూ.4 కోట్లతో 4,5,10 గ్రాముల తాళి బొట్టులు తయారీ.. నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయింపు. ధార్మిక సదస్సులో తీసుకున్న అన్ని నిర్ణయాలకు ఆమోదం.

TTD News Updates

ఇకపై ప్రతి ఏటా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి అవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 24వ తేదీన నిర్వహించాలని నిర్ణయం. అటవీ కార్మికుల జీతాలు పెంపు.. వడమాలపేటలోని ఉద్యోగుల ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు తుడాకు రూ.8.16 కోట్లు చెల్లింపు. రూ.3.89 కోట్లతో తిరుచానూరులో లైటింగ్ ఏర్పాటు. అలిపిరి వద్ద ఉన్న గోశాల వద్ద రూ.4.12 కోట్లతో శాశ్వత యాగశాల నిర్మాణం.. రూ.1.8 కోట్లు ఇచ్చేందుకు సముఖుత వ్యక్తం చేసిన శేఖర్ రెడ్డి. 15 పోటు సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదన. రూ.3.19 కోట్లతో సప్తగిరి అతిధిగృహం ఆధునికరణ. రూ. 3.15 కోట్లతో తిరుమల్లోని జలాశయ్యాలో ఉన్న 682 మోటార్ పంపులు మార్పు.

తిరుమల్లోని అతిధి గృహాలు, యాత్రి సదన్ ఎఫ్ఎంఎస్ సేవలు 3సంవత్సరాలు పొడిగింపు.. తిరుపతిలోని జీటీ ఆలయంలో శ్రీదేవి, భూదేవి ఉత్సవ నూతన బంగారు కవచాలు. రూ.15 లక్షలతో తండ్లకు బంగారు తాపడం. వెంకటశివ కృష్ణ ప్రసాద్ పదవి కాలం మూడు సంవత్సరాలు పెంపు. తాగునీటి అవసరాల కోసం ముగ్గు బావి ఆధునికరణ. జమ్మూలోని సిబ్బంది హెచ్‌ఆర్‌ఏ పెంపు.. తిరుపతిలోని హరేరామ హరేకృష్ణా రోడ్డులో రూ.7.5 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం. రూ.3.72 కోట్లతో 98 లక్షల భగవద్గీత బుక్‌ల ప్రింటింగ్. స్విమ్స్‌లోని వివిధ విభాగాల్లో నగదు రహిత సేవలు.

టీటీడీలోని(TTD) అవుట్ సోర్సింగ్ సిబ్బందికి రాయితీ పై భోజన సదుపాయం.. రూ.8.15 కోట్లతో క్యాంటీన్ నిర్మాణం.. అన్నదానంలో రూ.3 కోట్లతో వస్తువులు కొనుగోలు చెయ్యాలని నిర్ణయం.. సూపెర్వైజర్ పోస్టులతో పాటు క్రింద స్థాయి సిబ్బంది పోస్టుల భర్తీకి నిర్ణయం.. కొలంబోలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి టీటీడీ సహకారం. కళ్యాణం నిర్వహణకు ఆమోదం. టీటీడీలోని(TTD) క్రింది స్థాయి ఉద్యోగులకు గౌరవ వేతనాలు ఇవ్వాలని నిర్ణయం.. టీటీడీలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్న 9వేల అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పెంచుతూ టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.

Also Read : Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరు కానట్టేనా..?

Leave A Reply

Your Email Id will not be published!