TTD Security Comment : భ‌క్తుల భ‌ద్ర‌త గాలిలో దీప‌మేనా

వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో బెంబేలు

TTD Security Comment : క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవంగా భావించే శ్రీ‌నివాసుడు కొలువై ఉన్న తిరుమ‌ల గ‌త కొన్నేళ్లుగా త‌రుచుగా వివాదాలు చుట్టు ముడుతున్నాయి. సీఎం జ‌గ‌న్ వ‌చ్చాక టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుల‌ను పెంచ‌డం, శ్రీ‌వాణి ట్ర‌స్టుకు సంబంధించి విరాళాల విష‌యంలో క్లారిటీ ఉండ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి టీటీడీ(TTD) చైర్మ‌న్, ఈవో తాము వివ‌రాలు వెళ్ల‌డించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇదే స‌మ‌యంలో తిరుమ‌ల‌కు నిత్యం వేలాది మంది భ‌క్తులు సుదూర ప్రాంతాల నుండి ఆ దేవ దేవుడిని ద‌ర్శించుకునేందుకు వ‌స్తుంటారు. చిన్నారులు, పెద్ద‌లు, వృద్దులు ఇలా ప్ర‌తి రోజూ నిత్య క‌ళ్యాణం ప‌చ్చ తోర‌ణంలా ఉంటుంది పుణ్య‌క్షేత్రం తిరుమ‌ల‌. ఇక కొండ పైకి వెళ్లాలంటే నానా ఇబ్బందులు . వాహ‌నాల్లో వెళ్లే భ‌క్తుల‌కు సంబంధించి అలిపిరి ద‌గ్గ‌ర పూర్తిగా చెకింగ్ ఉంటుంది. భ‌క్తుల‌తో పాటు వారు తీసుకు వ‌చ్చిన ప్ర‌తి సామాన్ల‌ను, బ్యాగుల‌ను ప‌రిశీలిస్తారు. అత్యాధునిక టెక్నాల‌జీని వాడుతోంది టీటీడీ(TTD Security Comment).

TTD Security Comment From Chairman

తాజాగా సెక్యూరిటీని క‌ళ్లు గ‌ప్పి ఓ భ‌క్త కుటుంబం ఏకంగా శున‌కాన్ని కొండ పైకి తీసుకు వెళ్లారు. అది కంట ప‌డ‌డంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. భ‌ద్ర‌తా సిబ్బంది నిర్వాకంపై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయి. ఇక శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌కు సంబంధించి మొక్కులు తీర్చుకునేందుకు వేలాది మంది భ‌క్తులు శ్రీ‌వారి మెట్లు ద్వారా, అలిపిరి నుంచి కాలి న‌డ‌క‌న తిరుమ‌ల కొండ పైకి వెళుతుంటారు. అయితే క్రూర మృగం దాడి చేసి ఓ చిన్నారి ప్రాణాన్ని బ‌లిగొంది.

ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. దేశంలోనే అత్యంత గ‌ణ‌నీయ‌మైన ఆదాయం క‌లిగిన ఆల‌యంగా ప్ర‌సిద్ది చెందింది తిరుమ‌ల‌. కోట్లాది రూపాయ‌లు నిత్యం కానుక‌లు, విరాళాల రూపంలో వ‌స్తుంటాయి. ఇక ఆభ‌ర‌ణాల గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. కానీ కాలి న‌డ‌క‌న వ‌చ్చే భ‌క్తుల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుందో చెప్పే ప్ర‌య‌త్నం టీటీడీ(TTD) చేయ‌లేదు. ఒక‌వేళ అలా చేసి ఉన్న‌ట్ల‌యితే వ‌న్య మృగాల బారిన భ‌క్తులు ఎందుకు ప‌డ‌తార‌నే దానికి టీటీడీ చైర్మ‌న్, ఈవో నుంచి స‌మాధానం లేదు. ఉండ‌దు కూడా.

వీవీఐపీలు, బ‌డా బాబులు , కార్పొరేట్ కంపెనీల చైర్మ‌న్లు, వ్యాపార‌వేత్త‌లు, పారిశ్రామిక వేత్త‌లు, డ‌బ్బున్న మారాజుల సేవ‌లో టీటీడీ పాల‌క మండ‌లి మునిగి తేలుతోంద‌ని అందుకే త‌మ‌కు ఈ క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ని భ‌క్తులు వాపోతారు. క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. లెక్క‌కు మించి శ్రీ‌వారి ఆస్తులు, లెక్కించ‌లేనన్ని కోట్లాది రూపాయ‌లు మూలుగుతున్నాయి. నిత్యం వ‌ర‌ద‌లా వ‌స్తూనే ఉన్నాయి . కానీ సామాన్య భ‌క్తుల విష‌యం వ‌చ్చే స‌రికి, వారి భ‌ద్ర‌త విష‌యంలో నిర్ల‌క్ష్యం కొట్టొచ్చిన‌ట్టుగా క‌నిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా టెక్నాల‌జీ మారింది. సెక్యూరిటీ ప‌రంగా ఎన్నో కీల‌క మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ విష‌యంలో ఖ‌ర్చుకు వెనుకాడ‌కుండా అత్యాధునిక సౌక‌ర్యాల‌తో సెక్యూరిటీ క‌ల్పించేందుకు ఫోక‌స్ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక ఆదాయంపై, ఉన్న‌త వ‌ర్గాలు, వీవీపీల సేవ‌లో త‌రించే టీటీడీ(TTD) ఇక‌నైనా సెక్యూరిటీ క‌ల్పించే విష‌యంపై ఆలోచించాల‌ని భ‌క్తులు కోరుతున్నారు. భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి ఈ విష‌యంలో పున‌రాలిచిస్తే బావుంటుంది. లేక‌పోతే ఆ దేవ దేవుడే ర‌క్షించాల్సి ఉంటుంది.

Also Read : TTD Chairman : భ‌క్తుల భ‌ద్ర‌త విష‌యంలో రాజీ ప‌డం

Leave A Reply

Your Email Id will not be published!