TTD : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు
దర్శించుకున్న భక్తులు 40,638
TTD : తిరుమల – తిరుమలలో భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా భక్త బాంధవులు కొలువు తీరారు. శనివారం వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో స్వామి , అమ్మ వార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు.
TTD Hundi Updates
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. స్వామి, అమ్మ వార్లను ప్రత్యేకంగా అలంకరించారు. ఎక్కడ చూసినా ఉత్సవ శోభ కనిపిస్తోంది. ఏకాదశి పర్వదినం రోజున శ్రీనివాసుడిని , శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని, సకల శుభాలు కలుగుతాయని, అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఇదిలా ఉండగా బ్రేక్, వీఐపీ దర్శనాలు రద్దు చేసింది భక్తుల తాకిడికి. స్వామి వారిని 40,638 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 455 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.46 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) పాలకమండలి చైర్మన్ , ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు.
ఇదిలా ఉండగా సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న భక్త బాంధవులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ఏర్పాట్లు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి. చలి తీవ్రత ఎక్కువ కావడంతో తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది .
Also Read : Tirumala : వైకుంఠ ద్వార దర్శనం పోటెత్తిన భక్తజనం