Tunisha Sharma Comment : ఈ చిరునవ్వును చిదిమింది ఎవరు
తునీషా శర్మ మరణం తీరని విషాదం
Tunisha Sharma Comment : జీవితం నాటక రంగం. కానీ తళుకు బెళుకుల కలల రంగుల ప్రపంచంలో అందమే కాదు చిరునవ్వు కూడా శాపంగా మారింది. సినీ రంగానికి చెందిన వారు ఎందరో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుల్లి తెర కూడా ఇవాళ కీలక పాత్ర పోషిస్తోంది. అంతకంతకూ సెలెబ్రిటీ హోదా పెరుగుతుండడంతో రాను రాను అందులో నటించే వారికి విపరీతమైన డిమాండ్ ఉంటోంది.
తన అభినయంతో ఎందరో హృదయాలను దోచుకున్న తునీషా శర్మ(Tunisha Sharma) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది హత్య లేక సూసైడా అన్నది విచారణ తర్వాత తేలుతుంది.
ఈ మధ్యన లవ్ జిహాద్ అన్నది కొత్తగా వచ్చింది. అది దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇదంతా పక్కన పెడితే ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
అపారమైన అవకాశాలు కళ్ల ముందు పెట్టుకుని విలువైన జీవితాన్ని ఎందుకు కోల్పోవడానికి సిద్ద పడుతున్నారు. కుటుంబమా లేక తెచ్చి పెట్టుకున్న ప్రేమలా లేక యాంత్రికతతో కూడుకున్న జీవితమా అన్నది మరో ఆలోచించాల్సి ఉంది.
సభ్య సమాజం రోజు రోజుకు నియంత్రణను కోల్పోతోంది. సక్సెస్ అందుకోవాలన్న తపన, తక్కువ స్థాయిలో స్టార్ డమ్ చేరుకోవాలన్న కసి ఎక్కడా ఒక చోట ఉండనీయడం లేదు.
స్టార్ హీరోయిన్ గా పేరొందిన దీపికా పదుకొనే కూడా ఒకానొక దశలో చని పోవాలని అనుకుంది. కానీ తల్లి కాపాడింది. తండ్రి ప్రకాశ్ పదుకొనే గొప్ప బ్యాడ్మింటన్ ప్లేయర్.
బతికేందుకు కావాల్సినంత డబ్బులున్నా చివరకు కౌన్సిలింగ్ ద్వారా బయట పడింది. ఇదే విషయాన్ని స్వయంగా చెప్పింది. ఇది పక్కన పెడితే ఇవాళ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు తునీషా శర్మ(Tunisha Sharma) .
జనవరి 4, 2002 లో చండీగఢ్ లో పుట్టారు. కేవలం 20 ఏళ్లకే తనువు చాలించారు. కాదు బలవంతపు చావుకు లోనయ్యారు. భారతీయ టెలివిజన్ , సినీ రంగంలో నటిగా గుర్తింపు పొందారు. అనతి కాలంలోనే పేరు వచ్చింది తునీషా శర్మకు. మహారాణా ప్రతాప్ లో చాంద్ కవార్ గా నటించింది.
చక్రవర్తి అశోక్ సామ్రాట్ లో రాజ్ కుమారి అహంకారగా, ఇష్క్ సుభాన్ అల్లా లో జరా పాత్రలో , ఇంటర్నెట్ వాలా లవ్ లో ఆధ్యా వర్మ పాత్రలతో మరింత జనాదరణ పొందింది తునీషా శర్మ. ఆమె ఫితూర్ తో యంగ్ ఫిర్దౌస్ పాత్రతో సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చింది. బార్ బార్ దేఖోలో యంగ్ దియాగా నటించింది.
ఈ రెండు సినిమాల్లో పరిమిత పాత్రల్లో నటించినందుకు తునీషా శర్మ మరింత పాపులర్ అయ్యింది. దుర్గా రాణి సింగ్ లో మినీగా నటించి మెప్పు పొందింది.
అలీ బాబా దస్తాన్ ఈ కాబుల్ లో షీజాన్ మొహమ్మద్ ఖాన్ సరసన ప్రధాన పాత్ర పోషించింది. ఇదే తనను కొంప ముంచేలా చేసింది.
ఇద్దరూ ప్రేమలో పడ్డారు. 15 రోజుల కిందట తనకు ఖాన్ బ్రేకప్ చెప్పాడు. దానిని తట్టుకోలేక పోయింది తునీషా శర్మ(Tunisha Sharma) . చివరకు ఈ లోకం నుంచి నిష్క్రమించింది. ఇలాంటి సున్నిత మనుష్కులు ఎందరో రాలి పోతున్నారు.
వారందరికీ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత సమాజంపై ఉంది. సినిమా, టెలివిజన్ లేదా ఇతర ఏ రంగాలైనా సరే వాటన్నటి కంటే జీవితం గొప్పది.
కలల్ని ప్రేమిస్తున్నంత కాలం వాస్తవానికి దూరంగా ఉంటున్నంత కాలం ఇలాంటి వారు కాలిపోతూనే ఉంటారు. ప్రేమ తాత్కాలికం దానిని గుర్తించి మసులు కోగలితే బెటర్.
ఏది ఏమైనా ఈ నవ్వును చిదిమి వేసింది ఎవరో తెలియాలి. కఠిన శిక్ష పడాలి. అప్పుడే ఆమె ఆత్మ శాంతిస్తుంది.
Also Read : నటుడు షీజాన్ ఖాన్ అరెస్ట్