Tunisha Sharma Mother : తునీషా శర్మను షీజన్ ఖాన్ కొట్టాడు
యువ నటి తల్లి వనితా శర్మ ఆరోపణ
Tunisha Sharma Mother : యువ నటి తునీషా శర్మ కేసు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. సహ నటుడు షీజన్ ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. షీజన్ ఖాన్ , తునీషా శర్మ కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు.
ఆమె ఆత్మహత్య చేసుకునే కంటే 15 రోజుల ముందు షీజన్ ఖాన్ బ్రేకప్ చెప్పాడు. దీనిని తట్టుకోలేక సీరియల్ షెట్ లో ఉండగా బాత్రూంలో సూసైడ్ చేసుకున్నారు. తునీషా శర్మ ఆత్మహత్య సినీ ఇండస్ట్రీతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని, మానసికంగా వేధించాడని తునీషా శర్మ తల్లి వనితా శర్మ(Tunisha Sharma Mother) ఆరోపించారు. తాజాగా మరో సంచలన వ్యాఖ్యలు చేసింది.
షీజన్ ఖాన్ సెట్ లో ఉండగానే తునీషా శర్మ చెంపపై కొట్టాడని వాపోయింది. అంతే కాకుండా తన కూతురును మతం మార్చుకోవాలని వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. ఒక రకంగా ఇది హత్య కూడా కావచ్చని పేర్కొంది. తన కూతురు మృత దేహాన్ని కిందకు దించే సమయంలో షీజన్ ఖాన్ అక్కడే ఉన్నాడని వనితా శర్మ తెలిపారు.
ఇదిలా ఉండగా శనివారం శవమై కనిపించారు తునీషా శర్మ. ఆదివారం ఉదయం షీజన్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు 24 మందిని విచారించారు పోలీసులు కేసు గురించి. మరో వైపు బీజేపీ ఎమ్మెల్యేలు రామ్ కదమ్ , అతుల్ తో పాటు మంత్రి గిరీశ్ మహాజన్ కీలక కామెంట్స్ చేశారు. లవ్ జిహాద్ ఉందని ఆరోపించారు.
Also Read : నిత్య పాఠం హీరా బెన్ జీవితం