Vanitha Sharma Sheezan Khan : షీజాన్ ఖాన్ డ్ర‌గ్స్ కు బానిస

తునీషా శ‌ర్మ న‌టి త‌ల్లి సంచ‌ల‌న కామెంట్స్

Vanitha Sharma Sheezan Khan : యువ న‌టి తునీశా శ‌ర్మ ఆత్మ‌హ‌త్య కేసు రోజు రోజుకు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. స‌హ న‌టుడు షీజాన్ ఖాన్ పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌చ్చారు తునీశా శ‌ర్మ త‌ల్లి వ‌నితా శ‌ర్మ‌(Vanitha Sharma) . పెళ్లి చేసుకుంటాన‌ని మాట ఇచ్చాడ‌ని, ప్ర‌లోభానికి గురి చేశాడ‌ని, వాడుకుని వ‌దిలి వేశాడ‌ని వాపోయింది.

అంతే కాదు త‌న కూతురిని మాన‌సికంగా వేధింపుల‌కు గురి చేసి చివ‌ర‌కు హ‌త్య చేశాడంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. తాజాగా జాతీయ మీడియా సంస్థ (ఏఎన్ఐ) తో తునీశా శ‌ర్మ త‌ల్లి వ‌నితా శ‌ర్మ మాట్లాడారు. మ‌రో సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. షీజాన్ ఖాన్ మ‌త్తు మందుకు బానిస అని పేర్కొన్నారు.

గ‌త కొంత కాలం నుంచి డ్ర‌గ్స్ తీసుకుంటున్నాడ‌ని ఆరోపించారు వ‌నితా శ‌ర్మ‌(Vanitha Sharma) . కానీ ఎంత కాలం నుంచి తీసుకుంటున్నాడ‌నేది త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఇది తీవ్ర‌మైన , ఉన్న‌త‌మైన కేసు అని దీనిపై సమ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాల్సి ఉంద‌ని మ‌రో వైపు పోలీసులు స్ప‌ష్టం చేశారు. గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

తునీశా శ‌ర్మ సూసైడ్ నోట్ ల‌భించింద‌ని పేర్కొన్నారు. కానీ అందులో ఏముందో వెల్ల‌డించ‌లేదు. ఇదే స‌మ‌యంలో ల‌వ్ జిహాద్ మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు మంత్రి గిరీశ్ మ‌హాజ‌న్ దీని వెనుక ల‌వ్ జిహాద్ ఉందంటూ ఆరోపించారు.

షీజాన్ ఖాన్ కు ప‌లువురు అమ్మాయిల‌తో సంబంధాలు ఉన్నాయ‌ని వ‌నితా శ‌ర్మ మండిప‌డ్డారు. ఇదిలా ఉండ‌గా న‌టుడు విచార‌ణ‌కు స‌హ‌క‌రించ‌డం లేద‌ని పోలీసులు అంటున్నారు. అందుకే మ‌రో రెండు రోజుల పాటు క‌స్ట‌డీ ఇవ్వాల‌ని కోరారు. దీంతో కోర్టు అనుమ‌తి ఇచ్చింది.

Also Read : తునీషా శ‌ర్మ సూసైడ్ నోట్ ల‌భ్యం

Leave A Reply

Your Email Id will not be published!