Tunisha Sharma Mother : తునీషాను వాడు చంపేశాడు – వనిత
షీజాన్ ఖాన్ పై షాకింగ్ కామెంట్స్
Tunisha Sharma Mother : యువ నటి తునీషా శర్మ ఆత్మహత్యకు పాల్పడడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీని వెనుక సహ నటుడు షీజాన్ ఖాన్ ఉన్నాడని తునీషా శర్మ తల్లి వనితా శర్మ(Tunisha Sharma Mother) ఆరోపించింది. ఈ మేరకు పోలీసులు షీజాన్ ఖాన్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. నాలుగు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది కోర్టు.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రామ్ కదమ్ తో పాటు మంత్రి గిరీష్ మహాజన్ సంచలన కామెంట్స్ చేశారు. తునీషా శర్మ సూసైడ్ వెనుక లవ్ జిహాద్ ఉందని ఆరోపించారు. ఇక సోమవారం మృతురాలి తల్లి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తన కూతురు చావుకు షీజాన్ ఖాన్ కారణమని మరోసారి మండిపడ్డారు.
తన బిడ్డను మోసం చేశాడని, ఆ తర్వాత వాడుకుని వదిలి వేశాడని ఆరోపించారు. దీంతో తను చేసిన మోసాన్ని తట్టుకోలేక తన బిడ్డ తనకు కాకుండా పోయిందని వాపోయారు. గత కొంత కాలంగా షీజాన్ ఖాన్ , తునీషా శర్మ ప్రేమలో ఉన్నారు. గత 15 రోజుల కిందట షీజాన్ ఖాన్ తునీషా శర్మకు బ్రేకప్ చెప్పాడు.
దీంతో మనస్తాపానికి గురైన తునీషా శర్మ సీరియస్ షూటింగ్ లో ఉండగానే సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ఈ సందర్భంగా వనితా శర్మ వీడియోను విడుదల చేసింది. తన కూతురును పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడని, మరో మహిళతో సంబంధం కొనసాగిస్తూ వచ్చాడని ఆరోపించింది. నాలుగు నెలల పాటు ఉపయోగించు కున్నాడని వాపోయింది.
Also Read : ఈ చిరునవ్వును చిదిమింది ఎవరు