Tunisha Sharma Case : తునీషా శ‌ర్మ సూసైడ్ నోట్ ల‌భ్యం

వెల్ల‌డించిన ముంబై పోలీసులు

Tunisha Sharma Case : బాలీవుడ్ నే కాదు దేశ వ్యాప్తంగా సంచ‌లనం సృష్టించింది యువ న‌టి తునీషా శ‌ర్మ‌. కో స్టార్ షీజాన్ ఖాన్ వ‌ల్లే త‌న కూతురు చ‌ని పోయిందంటూ త‌ల్లి వ‌నితా శ‌ర్మ ఆరోపించింది. దీంతో ఆదివారం ఉద‌యం ఖాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజ‌రు ప‌రిచారు. కోర్టు మొదట నాలుగు రోజుల క‌స్టడీకి అనుమ‌తి ఇచ్చింది.

తీరా మ‌రింత స‌మాచారం రాబ‌ట్టేందుకు మ‌రో రెండు రోజులు కావాల‌ని పోలీసులు కోరారు. దీంతో కోర్టు రెండు రోజులు క‌స్ట‌డీకి ఓకే చెప్పింది. ఈ త‌రుణంలో కీల‌క అంశాలు వెలుగు చూశాయి. షీజాన్ ఖాన్ తునీషా శ‌ర్మ(Tunisha Sharma Case) కొద్ది కాలం పాటు డేటింగ్ లో ఉన్నారు. గ‌త 15 రోజుల కింద‌ట తునీషా శ‌ర్మ‌కు బ్రేక‌ప్ ఇస్తున్న‌ట్లు చెప్పాడు.

దీంతో పూర్తిగా ల‌వ్ లో కూరుకు పోయిన తునీషా త‌ట్టుకోలేక పోయింది. సీరియ‌ల్ సెట్ లో బాత్రూంలో ఉరి వేసుకుని క‌నిపించింది. ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించినా ఫ‌లితం లేక పోయింది. అయితే తునీషా శర్మ సూసైడ్ చేసుకుందా లేక హ‌త్య చేశారా అన్న కోణంతో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

ఇదే స‌మ‌యంలో బీజేపీ ఎమ్మెల్యేలు రామ్ కద‌మ్ , అతుల్ తో పాటు మంత్రి గిరీశ్ మ‌హాజ‌న్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. న‌టి మ‌ర‌ణం వెనుక ల‌వ్ జిహాద్ కోణం ఉంద‌ని ఆరోపించారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టాల‌ని, తునీషా శ‌ర్మ కుటుంబాన్ని ఆదుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు పోలీసులు.

తునీశా శ‌ర్మ ఆత్మ‌హ‌త్య‌కు సంబంధించి సూసైడ్ నోట్ దొరికింద‌ని వెల్ల‌డించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో షీజాన్ ఖాన్ కీల‌క నిందితుడిగా భావిస్తున్నారు. అత‌డికి త‌గిన రీతిలో శిక్ష ప‌డాల‌ని కోరారు త‌ల్లి వనితా శ‌ర్మ‌.

Also Read : చందా..వేణుగోపాల్ క‌స్ట‌డీ పొడిగింపు

Leave A Reply

Your Email Id will not be published!