Twitter Comment : సామాజిక మాధ్యమాలలో ట్విట్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యన టెస్లా చైర్మన్ ఎలోన్ మస్క్ ఎప్పుడైతే మైక్రో బ్లాగింగ్ సైట్ (ట్విట్టర్ ) పిట్ట కూతను చేజిక్కించుకున్నాడో ఆనాటి నుంచి చర్చల్లో కొనసాగుతూనే ఉంది. కారణం ట్విట్టర్ ఇవాళ కాదనలేని మాధ్యమంగా మారి పోయింది. ఆలోచనలు, అభిప్రాయాలు, వార్తలు, వాస్తవాలు, సంఘటనలు, హత్యలు, ఆత్మహత్యలు, రాతలు, విమర్శలు, ఆరోపణలు ఇలా చెప్పుకుంటూ ప్రతిదీ ట్విట్టర్ లో నిత్యం ప్రతిఫలిస్తున్నాయి. కోట్లాది మంది దీనిని వాడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారు. ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా ఎన్నో మాధ్యమాలు వచ్చాయి. మరెన్నో వేదికలు సిద్దంగా ఉంచాయి. అందుబాటులోకి తెచ్చాయి. కానీ ట్విట్టర్ ను ఢీకొనలేక చతికిల పడ్డాయి. దాని దరిదాపుల్లోకి వెళ్లలేక పోయాయి. మరొకొన్ని మైక్రో బ్లాగింగ్ సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి.
ట్విట్టర్ అదో వ్యసనం..అదో కలల ప్రపంచం. కన్నీళ్లు పెట్టిస్తుంది. అంతలోనే విస్తు పోయేలా చేసింది. విజయాలను స్మరించుకునేలా చేస్తుంది. గతాన్ని గుర్తుకు తెస్తుంది. వర్తమానాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. అంతే కాదు ఆరాటాలకు, పోరాటాలకు, ఉద్యమాలకు, కవులకు, కళాకారులకు, రచయితలకు, ప్రజాస్వామిక వాదులకు, రాజకీయ నాయకులకు, వివేచనాపరులకు, సృజనకారులకు, జర్నలిస్టులకు పిట్ట కూత మాధ్యమంగా కాదు అంతకు మించిన ఆయుధంగా ఉపయోగపడుతోంది. అంతకు మించిన భరోసా ఇస్తోంది. ట్విట్టర్(Twitter) వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. యావత్ ప్రపంచాన్ని క్షణాల్లో కళ్ల ముందు ఉంచుతోంది. అంతేనా గుండెల్ని మండించేలా చేస్తోంది. హృదయాలను ఆసక్తిరకమైన సన్నివేశాలతో ఓల లాడేలా చేస్తోంది. అంతకు మించి మెస్మరైజ్ చేస్తూ తనతో పాటే తీసుకు వెళుతోంది ట్విట్టర్.
కావాల్సినంత ప్రచారం. లెక్కకు మించినంత ఫాలోయింగ్. నీకు తోచింది ఏదైనా రాయి. కానీ నీకు నీవే జవాబుదారీ నేను మాత్రం కాదంటోంది పిట్ట కూత (ట్విట్టర్) . రాను రాను ఎన్నో మార్పులకు లోనైంది ట్విట్టర్(Twitter). కానీ ఎక్కడా తగ్గలేదు. మున్ముందుకు వెళుతూనే ఉంది. మస్క్ టేకోవర్ చేసుకున్నాక కాస్తంత ఒడిదుడుకులకు లోనైంది. కానీ మనోడు మామూలోడు కాదు కదా. అందుకే దానిని సక్సెస్ బాట పట్టించే పనిలో నిమగ్నం అయ్యాడు. దేనినైనా సరే పూర్తిగా ప్రాక్టికల్ గా ఆలోచించే దమ్మున్నోడు కాబట్టే దానిని వ్యాపారంగా మార్చే పనిలో పడ్డాడు. ఒక్కసారి ఈ పిట్టకూతతో సహవాసం చేస్తే ఇక జన్మలో విడిచి పెట్టలేని స్థితికి చేరుకుంటాం. మన బలహీనతలే తనకు బలంగా అని నమ్ముతోంది సదరు సంస్థ. ఏది ఏమైనా ట్విట్టర్ కు ముకుతాడు వేయాలని అనుకునే వాళ్లంతా డంగై పోతున్నారు. ప్రస్తుతానికి భారత్ లో భారీ జరిమానా విధించినా డోంట్ కేర్ అంటోంది ట్విట్టర్. ఏది ఏమైనా కలల బేహారులకు లోకమే వాకిలి కదూ.
Also Read : Klin Kaara konidela : పాప పేరు క్లిన్ కారా కొణిదెల