Two MLAs Resign : కాంగ్రెస్ కు షాక్ ఎమ్మెల్యేలు గుడ్ బై

మేఘాలయ అధికార పార్టీలోకి జంప్

Two MLAs Resign : కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. మేఘాల‌య కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు తాము పార్టీని వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అధికారంలో ఉన్న పార్టీకి జంప్ అయ్యారు. దీంతో మేఘాల‌య అసెంబ్లీలో అయిదు మంది ఎమ్మెల్యేల ఉన్న పార్టీ బ‌లం మూడుకు త‌గ్గింది. రాష్ట్రంలో మొత్తం 60 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

త్వ‌ర‌లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌జెల్ లింగ్డో , మొహేంద్రో రాప్ సాంగ్(Two MLAs Resign) రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎన్పీపీలో చేరున్న‌ట్లు వెల్ల‌డించారు. వివిధ రాజ‌కీయ పార్టీల‌కు చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరారు.

వీరు చేరిన ఆరు రోజుల త‌ర్వాత ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌లో ఇద్ద‌రు అధికార నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీలో చేరడం విశేషం. నాగాలాండ్ సీఎం , ఎన్పీపీ చీఫ్ కాన్రాడ్ కె సంగ్మా, రాజ్య‌స‌భ ఎంపీ , ఎన్పీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డ‌బ్ల్యూఆర్ ఖ‌ర్లూఖీ స‌మ‌క్షంలో ఎన్పీపీ తీర్థం పుచ్చుకున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందుకు స‌స్పెండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. వాళ్లు సీఎంతో స‌ఖ్య‌త‌గా మెల‌గ‌డంపై సీరియ‌స్ అయ్యింది. కాగా అసెంబ్లీ రికార్డుల్లో మాత్రం వారు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులే కావ‌డం విశేషం. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ 21 సీట్లు కైవ‌సం చేసుకుంది. మేఘాల‌య‌లో పార్టీ ప్ర‌జ‌ల‌తో సంబంధాల‌ను కోల్పోయిందంటూ రాజీనామా చేసిన వారు పేర్కొన్నారు.

పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌లు విశ్వాసంతో లేర‌ని పేర్కొన్నారు. ఇద్ద‌రినీ ఇప్ప‌టికే స‌స్పెండ్ చేయ‌డంతో వారి వ‌ల్ల ఒరిగేది ఏమీ ఉండ‌ద‌ని పేర్కొంది పార్టీ.

Also Read : జ‌మ్మూ కాశ్మీర్ లో ఎన్‌కౌంటర్

Leave A Reply

Your Email Id will not be published!