U19 India VS U19 Bangla : సెమీ ఫైన‌ల్ కు చేరిన యువ భార‌త్

బంగ్లాదేశ్ అండ‌ర్ -19 టీమిండియా

U19 India VS U19 Bangla : ఓ వైపు సీనియ‌ర్ ఆట‌గాళ్లు చేతులెత్తేస్తే అండ‌ర్ -19 యువ భార‌త ఆట‌గాళ్లు దుమ్ము రేపారు. ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్నీలో యువ భార‌త జ‌ట్టు సెమీ ఫైన‌ల్ లోకి దూసుకు వెళ్లింది.

డిఫెండింగ్ ఛాంపియ‌న్ బంగ్లాదేశ్ జ‌ట్టుపై (U19 India VS U19 Bangla)ప్ర‌తీకారం తీర్చుకుంది. క్వార్ట‌ర్ ఫైనల్ లో భార‌త జ‌ట్టు 5 వికెట్లు తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ఈ విజ‌యంతో 2020లో జ‌రిగిన అండ‌ర్ -19 ప్ర‌పంచ క‌ప్ ఫైన‌ల్ లో బంగ్లాదేశ్ యువ భార‌త్ ను ఓడించింది. దీంతో ఆనాటి ఓట‌మికి ఇవాల్టి విజ‌యంతో బ‌దులు తీర్చుకుంది.

ఇదిలా ఉండ‌గా మ్యాచ్ విష‌యానికి వ‌స్తే మొద‌ట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ టీం 37.1 ఓవ‌ర్ల‌లో 111 ప‌రుగుల‌కే ఆలౌటైంది. టీమిండియాకు చెందిన పేస‌ర్ ర‌వి కుమార్ ఏకంగా 14 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

త‌న స్వింగ్ బౌలింగ్ తో బంగ్లాదేశ్ ఆట‌గాళ్ల‌కు చుక్క‌లు చూపించాడు. ప‌రుగులు తీసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. ఇంకో బౌల‌ర్ స్పిన్న‌ర్ విక్కీ 25 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

త‌మ బౌలింగ్ దెబ్బ‌కు బంగ్లా త‌ల‌వంచ‌క త‌ప్ప‌లేదు. ఇక 112 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన యువ భార‌త జ‌ట్టు 30.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 117 ప‌రుగులు చేసింది.

ఓపెన‌ర్ అంగ్ కృష్ణ 44 ప‌రుగులు చేశారు. ఇందులో ఏడు ఫోర్లు ఉన్నాయి. ఆంధ్రాకు చెందిన క్రికెట‌ర్ షేక్ ర‌షీద్ 3 ఫోర్ల‌తో 26 ప‌రుగులు చేసి మ‌రోసారి రాణించాడు.

వీరిద్ద‌రూ క‌లిసి 70 ప‌రుగులు చేశారు. కెప్టెన్ య‌శ్ ధుల్ 20 ర‌న్స్ , కౌశ‌ల్ 11 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు.

Also Read : రోహిత్ శ‌ర్మ స‌రైన ఆప్ష‌న్ కాదు

Leave A Reply

Your Email Id will not be published!