Udhay Nidhi Stalin : మామన్నన్ సక్సెస్ ఉదయనిధి జోష్
దర్శకుడు మారి సెల్వరాజ్ కు ప్రశంస
Udhay Nidhi Stalin : మోస్ట్ టాలెంటెడ్ కలిగిన దర్శకుడిగా పేరు పొందిన మారి సెల్వరాజ్ దర్శకత్వంలో తాజాగా విడుదలైన మామన్నన్ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. ఈ సందర్భంగా మారి సెల్వరాజ్ ను ప్రత్యేకంగా అభినందించారు డీఎంకే చీఫ్ , తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. మా మన్నన్ చిత్రాన్ని స్టాలిన్ తనయుడు, నటుడు, మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ నటించడమే కాదు నిర్మించారు.
ఒక మంచి కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది. ఇప్పటికే మారి సెల్వరాజ్ తీసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ ఆలోచింప చేసేలా తీశాడు. ఆయా సినిమాలన్నీ సామాజిక అంశాలను ప్రాతిపదికగా తీసుకుని రూపొందించాడు దర్శకుడు మారి సెల్వరాజ్.
ఇక మా మన్నన్ సినిమాలో ప్రముఖ కమెడియన్ ఒడివేలును ప్రత్యేక పాత్రలో నటించేలా చేశాడు దర్శకుడు. ఈ చిత్రంలో ఉదయనిధి స్టాలిన్(Udhay Nidhi Stalin) , ఫాసిల్ , కీర్తి సురేష్ కీలక పాత్రల్లో అద్భుతంగా నటించారు. మా మన్నన్ కు అల్లా రఖా సంగీతం అందించాడు. ఇక మారి సెల్వరాజ్ కు మినిమం గ్యారెంటీ ఉన్న దర్శకుడిగా గుర్తింపు పొందారు తమిళ సినీ ఇండస్ట్రీలో.
ఇదిలా ఉండగా ఆదివారం దర్శకుడు మారి సెల్వరాజ్ ప్రత్యేకంగా ఉదయనిధి స్టాలిన్ ను. ఈ ఫోటోను ప్రత్యేకంగా షేర్ చేశాడు. మరో వైపు భిన్నమైన కథాంశంతో అద్భుతంగా తెర కెక్కించిన మారి సెల్వరాజ్ ను ప్రశంసలతో ముంచెత్తారు సినీ టెక్నీషియన్స్.
Also Read : Eatala Rajender : వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరాలి