Emine Dzhaparova : భారత్ కు ఉక్రెయిన్ మంత్రి రాక
అధికారికంగా ప్రకటన వెల్లడి
Emine Dzhaparova : ఓ వైపు రష్యా కన్నెర్ర చేసినా భారత్ మాత్రం అటు ఉక్రెయిన్ తో ఇటు రష్యాతో సత్ సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. తాజాగా ఉక్రెయిన్ దేశానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. ఈ మేరకు ఆ దేశానికి చెందిన ఉప విదేశాంగ మంత్రి ఎమిన్ ఝపరోవా సోమవారం భారత్ కు రానున్నారు.
ఇందులో భాగంగా ఆమె విదేశాంగ , సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ సలహాదారు విక్రమ్ మిస్త్రీని కలవనున్నారు. యుద్ధం తర్వాత తొలి అధికారిక ప్రకటన కావడం విశేషం. ఈ సందర్భంగా కీలక అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం.
ఈ సందర్శన మరింత పరస్పర అవగాహన, ఆసక్తులకు ఒక సందర్భంగా పేర్కొంది. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా దాడి ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ నుండి మొదటి అధికారిక పర్యటనలో యుద్దంలో దెబ్బతిన్న దేశం మొదటి ఉప విదేశాంగగ మంత్రి ఎమిన్ ఝపరోవా(Emine Dzhaparova) రానున్నారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు వస్తున్నారు. ఆమె నాలుగు రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.
ఉక్రెయిన్ లో ప్రస్తుత పరిస్థితి, పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని టాక్. భారత దేశం, ఉక్రెయిన్ పరస్పరం సహాయ సహకారాలు అందజేసుకుంటున్నాయి. ఈ రెండు దేశాల మధ్య సత్ సంబంధాలు గత 30 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్నాయి. ద్వైపాక్షిక సహకారం వాణిజ్యం, విద్య, సంస్కృతి, రక్షణ రంగాలలో గణనీయమైన పురోగతిని సాధించింది.
Also Read : పార్క్ జిన్ నోట నాటు నాటు పాట