Uma Geddam Pawan : రుజువు చేస్తే రాజీనామా చేస్తా – ఉమ
పవన్ కు మహిళా కమిషన్ మెంబర్ సవాల్
Uma Geddam Pawan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు, విశాఖ పట్టణానికి చెందిన వైసీపీ నాయకురాలు గెడ్డం ఉమ నిప్పులు చెరిగారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. రాజకీయ సైద్ధాంతిక విభేదాలు ఉంటే వాటి పైన వాదించండి, ప్రశ్నించండి ఎవరూ ఏమీ అనరు. కానీ పనిగట్టుకుని వ్యక్తిగతమైన కక్షతో తప్పుడు విమర్శలు చేయడం మానుకోవాలని ఉమ జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు సూచించారు.
Uma Geddam Pawan Kalyan Meeting Words
రాజకీయంగా సభలు పెట్టుకోండి. దానికి మీకు హక్కుంది. కానీ నిరాధార ఆరోపణలు చేసేందుకు మాత్రం మీకు హక్కు లేదని గుర్తుంచు కోవాలని పేర్కొన్నారు. ప్రతి సభలో రాష్ట్రంల 30 వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ (తప్పి పోయారు) అని , విమెన్ ట్రాఫికింగ్ అంటూ ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడం దారుణమన్నారు. మరీ ఇంత దిగజారి పోవాలా పదవి కోసం అంటూ పవన్ కళ్యాణ్ ను గెడ్డం ఉమ(Uma Geddam) ఎద్దేవా చేశారు.
ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఆధారాలు, వివరాలు తీసుకొని రండి లిస్టులో రాష్ట్రంలో ఏ గడపకైనా వెళదామని, 30 వేల కేసుల్లో విమెన్ ట్రాఫికింగ్ జరిగినట్లు ఒక్క కేసు రుజువైనా తాను మహిళా కమిషన్ మెంబర్ పదవికి రాజీనామా చేస్తానని గెడ్డం ఉమ సవాల్ విసిరారు. దీనికి పవన్ కళ్యాణ్ సిద్దమా అని అన్నారు.
Also Read : Bhola Shankar Disaster : భోళా శంకర్ కు మిశ్రమ స్పందన