Umesh : ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం కాలం కలిసి రాక పోతే. ఆటలు..రాజకీయాలు..సినిమాలు ఇవి వేటికవే పెనవేసుకుని వుంటాయి. వీటిని విడిగా చూడలేం. ఎందుకంటే ఈ మూడు నిత్యం వార్తల్లో నిలిచే వుంటాయి. వాటికున్న ప్రాధాన్యత అలాంటిది మరి. ఇక ఇండియా వరకు వస్తే ఇక్కడి అభిమానులకు, ప్రేమికులకు, యూత్ కు క్రికెట్ అంటే ప్రాణం. దాని కోసం కాలేజీలు ఎగ్గొడతారు. ఇంట్లో వాళ్లను ఎదిరిస్తారు. వాళ్లకు ఈ క్రికెటర్లు ఫెవరేట్లు. కాదనలేం ..ఈ ఆటకున్న మహత్తు అలాంటిది. ఊరిస్తుంది..ఊసురుమనేలా చేస్తుంది. నరాలు తెగే ఉత్కంఠను తెప్పిస్తుంది. అందుకే ఓ సీనియర్ పొలిటిషియన్ ఈ ఆటగాళ్లకు ఉన్న క్రేజ్ చూసి ఏమీ అనకుండా వెళ్లి పోయాడట.
ఆ తర్వాత జరిగిన విందు సందర్భంలో జీవితంలో ఒక్కసారైనా ఆడే అవకాశం వచ్చి వుంటే ఎంత బావుండేదోనని మరో సీనియర్ ప్లేయర్ తో తన ఒపియన్‌ను పంచుకున్నాడట. అంటే అర్థం దానికున్న పవర్..పబ్లిసిటీ అలాంటిది. ఒకే ఒక్క మ్యాచ్ హీరోలను జీరోలుగా మార్చేస్తుంది. మరో ఆటలో మరో ఆటగాడికి అనుకోని రీతిలో అందలం దక్కేలా చేస్తుంది. ఇదే బంతికి బ్యాట్ కూ మధ్య ఉన్న మ్యాజిక్ అలాంటిది. ఇక తాజా వార్తల్లోకి వస్తే నిన్నటి దాకా కోహ్లి కెప్టెన్సీలో మొదటి టెస్టులో దారుణంగా ఓటమి పాలై పరువు కోల్పోయిన భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన ఘనత తాత్కాలిక టెస్టు కెప్టెన్ అజింక్యా రహానేదే.
పక్కా ప్రొఫెషనల్ గేమ్ ఆడడంలో పేరు పొందిన ఆస్ట్రేలియా జట్టుతో వారి స్వంత గడ్డపై వారిని ఓడించడం అంటే మాటలా. గెలుపులో ఉన్న మజా ఏమిటో చాలా కూల్ గా క్రికెట్ ప్రేమికులకు గత ఏడాది కానుకగా ఇచ్చాడు ఈ స్పెషల్ ప్లేయర్. ఆటను ఆటగానే ఆస్వాదిస్తూ ఎలాంటి వత్తిళ్లకు తలొగ్గకుండా చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ పోవడంలో మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్నాడు మాజీ కెప్టెన్..ప్రముఖ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ. ఆ తర్వాత ఇపుడు రహానే రూపంలో మరో ప్లేయర్ దర్శనమిచ్చాడు ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో. ప్రధాన ప్లేయర్లు లేకుండానే జట్టు అద్భుతమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
మూడు టెస్టుల సిరీస్‌తో ప్రారంభమైన మ్యాచ్ లో చెరో మ్యాచ్ ను ఇరు జట్లు పంచుకున్నాయి. మూడో టెస్టు కీలకంగా మారింది. నియాన్ లైట్ల వెలుతురులో గులాబీ కలర్ బంతుల మధ్యన క్రికెట్ ను ఆస్వాదిస్తూ ఆడడం అంటే కత్తి మీద సాము చేసినట్లే. ఇంకో వైపు వరల్డ్ క్రికెట్ లో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, అనుచిత కామెంట్లు చేయడం, ప్రత్యర్థి జట్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయడం ఆస్ట్రేలియా జట్టుకు అలవాటే. దీనిని ముందే గమనించిన కూల్ బాయ్ రహానే లైట్ గా తీసుకున్నాడు. అంతే కాదు ఆటగాళ్లను పట్టించు కోవద్దంటూ సూచించాడు. వాళ్ల గేమ్ వాళ్లను ఆడనిద్దాం. మనమేమిటో నిరూపిద్దామని భరోసా ఇస్తున్నాడు. ఇదే క్రమంలో ఆటలో గాయపడ్డ ఉమేష్ స్థానంలో నటరాజన్ కు కలిసొచ్చింది. మూడో టెస్టులో ఇప్పటికే రోహిత్ వచ్చేశాడు. జట్టుకు మరింత బలాన్ని చేకూర్చింది. ఇక ఆడడమే తరువాయి. సిరీస్ చేజిక్కించు కోవడంపైనే తమ దృష్టి ఉంటుందని అంటున్న రహానే కోరిక నెరవేరాలని కోరుకుందాం.
No comment allowed please