Amazon Layoffs : అమెజాన్ దెబ్బ మామూలుగా లేదబ్బా
18 వేల మంది ఉద్యోగులపై వేటు
Amazon Layoffs : లాజిస్టిక్ రంగంలో వరల్డ్ వైడ్ గా టాప్ లో ఉన్న అమెజాన్ కొత్త సంవత్సరంలో కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇప్పటికే పలువురిని ఇంటికి సాగనంపిన అమెజాన్ ఉన్నట్టుండి ఏకంగా 18 వేల మంది కొలువులను తొలగించింది(Amazon Layoffs). ఈ మేరకు కీలక ప్రకటన చేసింది కంపెనీ. మరికొందరికి త్వరలోనే పింక్ స్లిప్ లు కూడా ఇచ్చేందుకు సిద్దం చేసింది.
ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ ఆండీ జాస్సీ. కాస్ట్ కట్టింగ్ లో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఉద్యోగులను తొలగించే కార్యక్రమానికి మొదటగా శ్రీకారం చుట్టింది మాత్రం టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్. రూ. 4,400 కోట్లకు మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను టేకోవర్ చేసుకున్నారు. ఆ వెంటనే టాప్ పొజిషన్ లో ఉన్న వారందరినీ సాగనంపాడు. ఇప్పటి వరకు 10 వేల మందికి పైగా తొలగించారు.
ఇందులో పర్మినెంట్ ఎంప్లాయిస్ తో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా తొలగించారు. ఆ తర్వాత ఎలోన్ మస్క్ ను ఆదర్శంగా తీసుకున్న ఐటీ , లాజిస్టిక్ , తదితర కంపెనీలు కంటిన్యూగా ఉద్యోగులను తీసి వేసే పనిలో పడ్డాయి.
మీడియా రంగంలో 6 వేల మందికి పైగా కొలువులు కోల్పోయారు. గూగుల్ లో 10 వేల మంది, మైక్రోసాఫ్ట్ లో 10 వేల మంది, జొమాటోలో మరికొందరిని తొలగించారు. ఇక ఈ కామర్స్ సెక్టార్ లో టాప్ లో కొనసాగుతూ వస్తున్న అమెజాన్(Amazon Layoffs) ముందస్తు సమాచారం లేకుండా పక్కన పెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసేలా చేసింది. తప్పని పరిస్థితుల్లో జాబర్స్ ను తొలగించాల్సి వచ్చిందని పేర్కొన్నారు అమెజాన్ సీఇఓ.
Also Read : సత్య నాదెళ్ల జై శంకర్ ములాఖత్