Virat Kohli : ఏ ఆటగాడికైనా ఆటలో ఆడుతున్నప్పుడే వాల్యూ. లేక పోతే ఏ కంపెనీ పట్టించుకోదు. కానీ భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (Virat Kohli )గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఎందుకంటే ఏ భారతీయ క్రికెటర్ కు లేనంతటి స్టార్ ఇమేజ్ ఇతడికి ఉందనేది బహిరంగ రహస్యమే.
భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పేరు మోసిన కంపెనీలకు అతడు బ్రాండ్ అంబాసిడర్.
తాజాగా మనోడు టీ20, వన్డేతో పాటు టెస్టు మ్యాచ్ లకు కెప్టెన్ నుంచి తప్పుకున్నాడు.
దీంతో అభిమానులకే కాదు ఇతరులకు సైతం కోహ్లీ (Virat Kohli)వాల్యూ ఏమైనా తగ్గుతుందా అన్న అనుమానం రాక తప్పదు.
కానీ కెప్టెన్సీ కోల్పోవడం వల్ల ఒక్క పైసా కూడా నష్టం అంటూ ఉండదు.
కోహ్లీ(Virat Kohli )నికర ఆస్తుల విలువ గత ఏడాది 2021 జూన్ వరకు పోలిస్తే దాదాపు భారతీయ రూపాయల్లో 1600 కోట్లు ఉంటుందని అంచనా.
బీసీసీఐ నుంచి వార్షిక వేతనం రూ. 7.2 కోట్లు, ఆర్సీబీ కాంట్రాక్టు కింద ఏడాదికి రూ. 17 కోట్లు,
వీటితో ఆయా బ్రాండ్ల ద్వారా కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది కోహ్లీకి. ఇక సోషల్ మీడియా గురించి ఎంత చెప్పినా తక్కువే.
ఒక్క ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తే రూ. 5 కోట్లు వస్తున్నాయంటే మనోడి రేంజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
కోహ్లీ చేస్తున్న కంపెనీలలో మైంత్రా, గ్రేట్ లెర్నింగ్ , హిమాలయ, మొబైల్ ప్రిమీయర్ లీగ్ , ప్యూమా, వోలిని, విక్స్ ఇండియా, టూ యామ్ , ఎంఆర్ఎఫ్ టైర్స్ , ఫిలిప్స్ ఇండియా, ఊబర్ ఇండియాకు బ్రాంబ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
వీటితో పాటు వెల్మాన్, మన్యవర్, అమెరికన్ టూరిస్టర్, ఫాస్ట్రాక్ , రాయల్ ఛాలెంజ్ , టిస్సాట్ , కోల్గేట్ పామోలివ్ , బ్లూ స్టార్, హీరో మోటో కార్ప్ , అమేజ్ ఇన్వర్టర్లు అండ్ బ్యాటరీస్ , శ్యామ్ స్టీల్ , డిజిట్ ఇన్సూరెన్స్ , వివో తో పాటు చాలా కంపెనీలు ఉన్నాయి కోహ్లీ ఖాతాలో.
ఎనిమిదికి పైగా టాప్ కార్లు కూడా ఉన్నాయి. విరాట్ కోహ్లీ ఫౌండేషన్ చారిటీ సంస్థ ఏర్పాటు చేశాడు. దేశంలో విరాట్ కోహ్లీ యూత్ కు ఓ ఐకాన్ గా ఉన్నాడు.
కెప్టెన్సీకి రాజీనామా చేసినా తన జోష్ తగ్గలేదు. ఏ మాత్రం బ్రాండ్ వాల్యూలో కూడా తగ్గదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read : తమిళనాట చెరగని ముద్ర ఎంజీఆర్