Under 19 T20 World Cup : వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్
అండర్ 19 టీ20 వరల్డ్ కప్
Under 19 T20 World Cup : భారత క్రికెట్ లో ఈ ఏడాది అన్నీ శుభ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే భారత పురుషుల జట్టు స్వదేశంలో దుమ్ము రేపుతోంది. శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సీరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. న్యూజిలాండ్ కు సైతం చుక్కలు చూపించింది. మూడు వన్డేల సీరీస్ ను కైవసం చేసుకుంది.
ఇక మహిళా ఐపీఎల్ కు సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు భారీ ఎత్తున ఊహించని ఆదాయం సమకూరింది. కేవలం మహిళా జట్ల వేలం పాట ద్వారా ఏకంగా రూ. 4,769 కోట్లు సమకూరాయి. ఇక అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో భారత మహిళా జట్టు ఏకంగా ఫైనల్ కు చేరింది. సత్తా చాటింది.
న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ లో 8 వికెట్ల తేడాతో దుమ్ము రేపారు. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించారు. భారత మహిళా జట్టు కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 107 రన్స్ కు పరిమితం చేసింది. అనంతరం 108 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు 14.2 ఓవర్లలో లక్ష్యాన్ని(Under 19 T20 World Cup) ఛేదించింది 2 వికెట్లు కోల్పోయి.
మహిళా జట్టులో ఓపెనర్ శ్వేతా సెహ్రావత్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. కేవలం 45 బంతులు మాత్రమే ఆడిన ఆమె 61 పరుగులు చేసింది. మరో క్రికెటర్ సౌమ్య తివారీ 26 బంతులు ఆడి 22 రన్స్ చేసింది. ఇద్దరూ భారత్ గెలుపొందడంలో కీలక పాత్ర పోషించారు. ఫైనల్ కు చేరిన భారత మహిళా జట్టును ప్రత్యేకంగా అభినందించింది బీసీసీఐ.
Also Read : టీ20 సీరీస్ కు టీమిండియా రెడీ