ICC U19 India : బంగ్లాదేశ్ తో భార‌త్ రె’ఢీ’

భార‌త్ కు షాక్ నిషాంత్ కు క‌రోనా

ICC U19 India : అండ‌ర్ -19 వ‌ర‌ల్డ్ క‌ప్ లో వ‌రుస విజ‌యాల‌తో దుమ్ము రేపుతున్న భార‌త జ‌ట్టుకు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇప్ప‌టికే ఆరుగురు క‌రోనా బారిన ప‌డి మెల్ల‌గా కోలుకున్నారు.

వారంతా ప్రాక్టీస్ సెష‌న్ లో పాల్గొన్నారు. అయితే స్టార్ ఆల్ రౌండ‌ర్ గా పేరొందిన నిషాంత్ సింధుకు క‌రోనా సోకింది. దీంతో టీమిండియా శిబిరంలో క‌ల‌క‌లం రేగింది.

ఇప్ప‌టికే అండ‌ర్ -19 జ‌ట్టు స్కిప్ప‌ర్ కు క‌రోనా సోక‌డంతో ప‌క్క‌న పెట్టారు. ప్ర‌స్తుతం జూనియ‌ర్ వ‌ర‌ల్డ్ క‌ప్ హాట్ ఫెవ‌రేట్ గా మ‌న జ‌ట్టు ఉంది. ఇవాళ బంగ్లాదేస్ అండ‌ర్ -19 (ICC U19 India)జ‌ట్టుతో భార‌త జ‌ట్టు క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌నుంది.

క‌రోనా బారిన ప‌డి కోలుకున్న స్కిప్ప‌ర్ య‌ష్ ధుల్ , షేక్ ర‌షీద్ తో పాటు మిగ‌తా ఆట‌గాళ్లు ముమ్మ‌రంగా ప్రాక్టీస్ సెష‌న్ లో పాల్గొన్నారు. ఇప్ప‌టికే ఫుల్ ఫామ్ తో దూసుకు పోతున్నారు మ‌న ప్లేయ‌ర్లు.

ఓ వైపు జూనియ‌ర్ ఆట‌గాళ్లు దుమ్ము రేపుతుంటే మ‌న సీనియ‌ర్ ఆట‌గాళ్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. స‌ఫారీ టూర్ లో చేతులెత్తేశారు. వ‌న్డే సీరీస్ తో పాటు టెస్టు సీరీస్ కూడా కోల్పోయి ఇంటికి వ‌చ్చేశారు.

ఇదిలా ఉండ‌గా ఆల్ రౌండ‌ర్ గా స‌త్తా చాటిన నిశాంత్ సింధు ఇవాళ జ‌రిగే కీల‌క మ్యాచ్ కు దూరం కావ‌డంతో టీమిండియా శిబిరంలో కొంత మౌనం అలుముకుంది.

కెప్టెన్ లేక పోయినా తానే ముందుండి జ‌ట్టును స‌క్సెస్ ఫుల్ గా న‌డిపించాడు నిశాంత్ సింధు. అయితే బంగ్లాదేశ్ జ‌ట్టును ఈజీగా తీసుకునేందుకు వీలు లేదు. ఎందుకంటే గ‌త ఏడాది బంగ్లా అండ‌ర్ -19 జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా నిలిచింది.

Also Read : ఇంగ్లండ్ స్కిప్ప‌ర్ గా మోయిన్ అలీ

Leave A Reply

Your Email Id will not be published!