Ashwini Choubey Accident : కేంద్ర మంత్రి అశ్విని కారు బోల్తా
పోలీసులకు తీవ్ర గాయాలు
Ashwini Choubey Accident : కేంద్ర మంత్రి అశ్విని చౌబే కాన్వాయ్ కి అతి పెద్ద ప్రమాదం తప్పింది. బీహార్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి చౌబే కాన్వాయ్ కారు బోల్తా పడింది. పోలీసులకు గాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన బోల్తా పడిన ఎస్కార్ట్ వాహనాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ దుమ్రాన్ సదర్ ను ఆస్పత్రికి హుటా హుటిన తరలించారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో సహాయ మంత్రిగా ఉన్నారు అశ్విని చౌబే. ఆయన బీహార్ లో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎస్కార్ట్ వాహనం ప్రమాదమైంది. కేంద్ర మంత్రి అశ్విని చౌబే బక్సర్ నుంచి పాట్నా వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు కేంద్ర సహాయ శాఖ మంత్రి అశ్విని చౌబే(Ashwini Choubey). బక్సర్ నుండి ఆట్నాకు వెళుతుండగా కార్కేడ్ లోని కోరన్ సరాయ్ పోలీస్ స్టేషన్ కు చెందిన కారు దుమ్రావ్ మథిలా – నారాయణ పూర్ రహదారి వంతెన కాలువలో ప్రమాదానికి గురైంది.
శ్రీరాముని దయ వల్ల తామంతా క్షేమంగా బతికి బయట పడ్డామని వెల్లడించారు. ఈ ఘటనలో గాయపడిన పోలీసులు, డ్రైవర్ తో కలిసి దుమ్రాన్ సదర్ ఆస్పత్రికి వెళ్లానని తెలిపారు. అక్కడ ప్రాథమిక చికిత్స పూర్తయింది. అనంతరం మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ కు తరలించినట్లు తెలిపారు అశ్విని చౌబే.
Also Read : విమాన ప్రమాదం గాయని దుర్మరణం