Upendra Kushwaha : మా బంధం ఫెవికోల్ కంటే బలమైంది
మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహ వెల్లడి
Upendra Kushwaha : బీహార్ లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీజేపీ, జేడీయూ మధ్య దూరం పెరిగింది. ఇప్పటికే సీఎం నితీష్ కుమార్ కటీఫ్ చెప్పేందుకే మొగ్గు చూపారు.
ఇవాళ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ప్రతిపక్షాల నేతలతో ఆయన టచ్ లో ఉన్నారు. కానీ అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర కుష్వాహ మాత్రం అలాంటిది ఏమీ లేదంటున్నారు.
అంతా ప్రశాంతంగానే ఉందంటున్నారు. కమలం, జేడీయూ మధ్య బంధం గట్టిగానే ఉందని, దీనిని ఎవరూ తొలగించ లేరంటూ కామెంట్ చేశారు. ఓ వైపు ఆర్సీపీ సింగ్ జేడీయూకు గుడ్ బై చెప్పారు.
ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. కానీ భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉంటూ వచ్చారు. ఆపై ఉన్నట్టుండి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
అంతే కాకుండా పార్టీ చీఫ్, సీఎం నితీష్ కుమార్ పై నిప్పులు చెరిగారు. దీంతో బీజేపీ వెనుక ఉండి నాటకం ఆడిస్తోందంటూ భావిస్తున్నారు సీఎం.
ఆయన మరో ఏక్ నాథ్ షిండే లాగా మారే అవకాశం ఉందని వెంటనే అలర్ట్ అయ్యారు నితీశ్ కుమార్. కానీ ఉపేంద్ర కుష్వాహ మాత్రం అలాంటిది ఏమీ లేదని చెప్పడం విశేషం.
విచిత్రం ఏమిటంటే తమ నాయకుడికి దేశ ప్రధాన మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. మిత్రపక్షాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు లేవని స్పష్టం చేశారు ఉపేంద్ర కుష్వాహ(Upendra Kushwaha).
Also Read : కాషాయ బంధానికి జేడీయూ కటీఫ్