Ursula von der Leyen : భార‌త్ తో ఈయూ బ‌ల‌మైన బంధం

ఈయూ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయ‌న్

Ursula von der Leyen  : ఉక్రెయిన్ పై ర‌ష్యా యుద్దం చేస్తుండ‌డం. భార‌త్ ర‌ష్యాతో దోస్తీ క‌లిగి ఉండ‌డం. మ‌రో వైపు ఇత‌ర దేశాల‌తో కంటే ఇండియా త‌ట‌స్త వైఖ‌రిని అవ‌లంభించ‌డాన్ని అమెరికా త‌ట్టుకోలేక పోతోంది.

ఇదే స‌మ‌యంలో బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతంగా ముగించుకున్నారు. భార‌త ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ త‌న‌కు ఖాస్ దోస్త్ అని కొనియాడారు.

ఇదే స‌మ‌యంలో ఇరు దేశాలు ప‌లు అంశాల‌పై సంత‌కాలు చేశాయి. ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ త‌రుణంలో యూరోపియ‌న్ యూనియ‌న్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయ‌న్(Ursula von der Leyen )భార‌త ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. యూరోపియ‌న్ యూనియ‌న్ కంట్రీస్ , భార‌త దేశం ఒకే సారూప్య‌త క‌లిగి ఉన్నాయ‌ని చెప్పారు. ఆయా దేశాల మ‌ధ్య శాంతియుత‌మైన వాతావ‌ర‌ణంతో పాటు స్నేహ బంధాన్ని తాము కోరుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

ఆమె త‌న టూర్ లో భాగంగా దేశ రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ తో పాటు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో స‌మావేశం కానున్నారు. అంత‌కు ముందు ఆమె మీడియాతో మాట్లాడారు.

భార‌త్ తో ఎలాంటి ఇబ్బందులు లేవ‌న్నారు. తాము ఈ దేశంతో స్నేహం కోరుకుంటున్నామ‌ని , ఇత‌ర స‌మ‌స్య‌లు ఉంటే వాటిని చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకుంటామ‌ని తెలిపారు.

ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ఈయూ చీఫ్ భారత్ లో ప‌ర్య‌టించ‌డం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆమె మోదీతో ఏం మాట్లాడ బోతున్నార‌నేది ఉత్కంఠ రేపుతోంది..

Also Read : క‌స్ట‌డీకి ఎంపీ న‌వ‌నీత్..ఎమ్మెల్యే రాణా

Leave A Reply

Your Email Id will not be published!