USA INDIA : అమెరికా మరోసారి భారత్ (India) ను టార్గెట్ చేసింది. తనతో పాటు మిత్ర దేశాలు విధించిన ఆంక్షలను అణగదొక్కే రష్యా (Russia) ప్రతిపాదనను పరగిణలోకి తీసుకున్నందుకు (USA INDIA)మండిపడింది.
ఇండియాను (India) అమెరికాతో (USA) పాటు ఆస్ట్రేలియా తీవ్రంగా విమర్శించాయి. విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ చర్చల కోసం ఢిల్లీకి రానున్నారు. ఇప్పుడు చరిత్ర ఎవరినీ పక్కన పెట్టేయడానికి వీలు లేదు.
ఈ యుద్దంలో ఎవరు ఎవరి వైపు ఉంటారనేది తేలాల్సిన అవసరం ఉంది. ఉక్రెయిన్ (Ukraine) ప్రజలతో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం , సార్వ భౌమాధికారం కోసం నిలబడాలి. రష్యా (Russia) చీఫ్ పుతిన్ యుద్దనీతిని పాటించడం లేదు.
అమెరికా (America) దేశ వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో మీడియాతో మాట్లాడారు. భారత దేశం అనుసరిస్తున్న విధానం సరిగా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్ట్రేలియా వాణిజ్య శాఖ మంత్రి డాన్ టెహన్ రెండో ప్రపంచ యుద్దం నుండి మనం కలిగి ఉన్న రూల్స్ ఆధారిత విధానాన్ని పాటించాలని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య దేశాలు కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ కలిగి ఉన్న ఆసియా పసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కొనేందుకు ఎలాంటి విధానాలు అవలంభించాలనే దానిపై ఫోకస్ (USA INDIA)పెట్టాలన్నారు.
భారత దేశం కాల్పుల విరమణ, దౌత్య పరమైన పరిష్కారం కోసం మద్దతు ఇచ్చినా చివరకు మాస్కో చేత వీటో చేసిన రష్యా దండయాత్రను ఖండిస్తూ చేసిన తీర్మానంలో ఓటు వేయకుండా దూరంగా ఉంది ఇండియా.
Also Read : ఇమ్రాన్ నిర్ణయం జాతిని ఉద్దేశించి ప్రసంగం