Uttam Kumar Reddy : పార్టీ మార్పుపై ఉత్తమ్ క్లారిటీ
కాంగ్రెస్ నుంచే బరిలోకి
Uttam Kumar Reddy : మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న దుష్ప్రచారాన్ని కొట్టి పారేశారు. తన రక్తం అంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉందన్నారు. కానీ కొందరు కావాలని తనపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
Uttam Kumar Reddy Serious Comments
తనపై లేని పోని ఆరోపణలు చేస్తూ , వెళ్లి పోతున్నానంటూ భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నాన్నంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. తాను ముందు నుంచీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, దానినే నమ్ముకున్నానని పేర్కొన్నారు.
తన ఎదుగుదలకు పార్టీ దోహద పడిందని స్పష్టం చేశారు. తమ స్వప్రయోజనాల కోసం ఒకరిద్దరు తనను , కొంత మందిని టార్గెట్ చేశారని దానిలో వాస్తవం ఎంత మాత్రం లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy). ఇక రాబోయే శాసనసభ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టారు.
తాను , తన భార్య ఎక్కడి నుంచి పోటీ చేస్తామనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. హుజూర్ నగర్ నుండి తాను , కోదాడ నుండి తన భార్య పద్మావతి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తారని ప్రకటించారు. ఇక నుంచి ఇలాంటి అసత్య ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలని కోరారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.
Also Read : India vs Ireland 2nd T20 : సిరీస్ పై కన్నేసిన టీమిండియా