CM Dhami Visits Pant : పంత్ ను ప‌రామ‌ర్శించిన సీఎం

ఆరోగ్యంపై పుష్కర్ సింగ్ ధామి ఆరా

CM Dhami Visits Pant : రూర్కీ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్ర‌మాదానికి గురైన ప్ర‌ముఖ క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ఆరోగ్యంపై ఆరా తీశారు ఉత్త‌రాఖండ్ సీఎం పుష్క‌ర్ సింగ్ ధామి. ఆదివారం డెహ్రాడూన్ ప్ర‌ధాన ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న రిష‌బ్ పంత్ ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు.

ఆస్ప‌త్రి వైద్యులు సీఎంకు ఎలా వైద్య సేవ‌లు అంద‌జేస్తున్నామ‌నే దాని గురించి వివ‌రించారు. ఇదిలా ఉండ‌గా రిష‌బ్ పంత్ ఆరోగ్యం గురించి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ తెలుసుకున్నారు. ఈ మేర‌కు పంత్ త‌ల్లితో ఆయ‌న ఫోన్ లో మాట్లాడారు. ఎలాంటి స‌హాయం అందించేందుకైనా కేంద్రం స‌హ‌క‌రిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి(CM Dhami Visits Pant) ఇప్ప‌టికే మొత్తం పంత్ కు అయ్యే వైద్య ఖ‌ర్చుల‌ను న‌యా పైసాతో భ‌రిస్తామ‌ని వెల్ల‌డించారు. అధికారికంగా ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. ఎంత ఖ‌ర్చు అయినా స‌రే వెచ్చిస్తామ‌న్నారు. అవ‌స‌ర‌మైతే ఎక్క‌డైనా వైద్యం అందించినా తాము సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు పుష్క‌ర్ సింగ్ ధామి.

అంతే కాకుండా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పంత్ ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం సీఎం మీడియాతో మాట్లాడారు. పంత్ ఆరోగ్యం బాగానే ఉంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో రిష‌బ్ పంత్ ప్రాణాల‌ను కాపాడిన హ‌ర్యానా రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కు చెందిన డ్రైవ‌ర్, కండ‌క్ట‌ర్ల‌ను జ‌న‌వ‌రి 26న జ‌రిగే గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుక‌ల్లో స‌త్కారం చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Also Read : పంత్ ను కాపాడినోళ్ల‌కు స‌న్మానం

Leave A Reply

Your Email Id will not be published!