V Hanumantha Rao Gaddar : గద్దరన్న మృతి తీరని లోటు
వి. హనుమంతరావు
V Hanumantha Rao Gaddar : ప్రజా గాయకుడు గద్దర్ ఇవాళ చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. ఆయనకు మరణం లేదంటూ నినదిస్తున్నారు. తన ఆట పాటలతో కోట్లాది ప్రజలను చైతన్యవంతం చేసిన యోధుడు గద్దర్. ఆయన లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతున్నామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి. హనుమంత్ రావు(V Hanumantha Rao) గద్దర్ మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తామిద్దరం సోదరులమన్నారు.
V Hanumantha Rao Gaddar Emotional Words
గద్దర్ మృతి తీరని లోటు గా పేర్కొన్నారు. ఆయన మరణం యావత్ దేశానికే నష్టమని పేర్కొన్నారు. తనతో ఒక ఫోటో తీసుకుంటానని అన్నారని గుర్తు చేశారు. ఇద్దరం కలిసినప్పుడుల్లా అన్నా కొత్త పాట రాసినావా అని అడిగే వాడినని అన్నారు వి. హనుమంతరావు.
అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కు చెందిన ప్రముఖ గాయకురాలు విమలక్క కన్నీటి పర్యంతం అయ్యారు. గద్దరన్న మరణం జీర్ణించు కోలేక పోతున్నానని వాపోయారు. ఆయన పాడని పాట లేదు. మాట్లాడని మాట లేదన్నారు. ఇవాళ తెలంగాణ యావత్తు విషాదంలో నిండి పోయింది. పీఓడబ్ల్యూ సంధ్య ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ తిరిగి వస్తాడని అనుకున్నానని పేర్కొన్నారు. సాంస్కృతిక కళా రూపాలకు ప్రతీకంగా ఉన్నాడని తెలిపారు.
Also Read : Gaddar Comment : దివికేగిన ప్రజా గానం