V Somanna Comment : ఛీ ఛీ ‘దేశం’ సిగ్గు ప‌డుతోంది

ప్ర‌జా ప్ర‌తినిధులా రౌడీలా

V Somanna Comment : భ‌ర‌త మాత గ‌నుక బ‌తికి ఉండి ఉంటే క‌న్నీళ్లు పెట్టుకునేది. నిత్యం ..వేదాలు..పురాణాలు.. దేవుళ్లు..ఆల‌యాలు. .కులాలు.. మ‌తం..ప్రాంతం..భాష పేరుతో నీతులు వ‌ళ్లించే భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇప్పుడు క‌ట్టు త‌ప్పుతోందా అన్న అనుమానం త‌లెత్తుతోంద‌. ఒక‌ప్పుడు విలువ‌ల‌కు, సంప్ర‌దాయాల‌కు క‌ట్టుబ‌డి ఉండే వార‌న్న ప్ర‌తీతి.

కానీ రాను రాను బీజేపీ సార‌థ్యంలో రెండోసారి కేంద్రంలో కొలువు తీరాక ప‌ట్ట ప‌గ్గాలు లేకుండా పోయింది. ఆదివారం జ‌రిగిన సంఘ‌ట‌న యావ‌త్ దేశాన్ని సిగ్గుతో త‌ల వంచుకునేలా చేసింది.

క‌ర్ణాట‌క‌లో కొలువు తీరిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి వి. సోమ‌న్న త‌న వ‌ద్ద‌కు సాయం కోసం వ‌చ్చిన మ‌హిళ‌పై చేయి చేసుకున్నారు.

ఆపై చెంప ఛెళ్లుమ‌నిపించారు. యావత్ దేశ‌మంతా ఈ ఘ‌ట‌న‌పై స్పందించింది. నిర‌స‌న‌ల‌తో హోరెత్తింది. ప్ర‌తిపక్షాలు త‌ప్పును ఎత్తి చూపాయి. 75 ఏళ్ల స్వ‌తంత్ర భార‌తంలో ..వ‌జ్రోత్స‌వాలు జ‌రుపుకుంటున్న ఈ త‌రుణంలో మ‌హిళ‌లు, బాలిక‌ల‌కు, యువ‌తుల‌కు స్వేచ్ఛ లేకుండా, భ‌ద్ర‌త లేకుండా పోయింద‌న్న‌ది వాస్త‌వం.

ఇప్ప‌టికే గుజ‌రాత్ సంఘ‌ట‌న త‌ల దించుకునేలా చేసింది. బిల్కిస్ బానో రేప్ , హ‌త్య చేసిన కేసులో జీవిత ఖైదు ప‌డిన నిందితుల ప్ర‌వ‌ర్త‌న బాగుందంటూ గుజ‌రాత్ బీజేపీ స‌ర్కార్ దేశానికి స్వేచ్ఛ ల‌భించిన 15 ఆగస్టు రోజు విడుద‌ల చేసింది. ఎనిమిది వేల మందికి పైగా మ‌హిళ‌లు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ కోర్టులో దావా వేశారు.

దానిపై ఇంకా తీర్పు రాలేదు. ఇక ద్వేష పూరిత ప్ర‌సంగాల‌కు దిక్కు లేకుండా పోయింది. బీజేపీ స్పోక్స్ ప‌ర్స‌న్ గా ఉన్న నూపుర్ శ‌ర్మ చేసిన

వ్యాఖ్య‌లు ఏకంగా దేశ వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం చేసేలా చేసింది.

ఆ త‌ర్వాత క‌ర్ణాట‌క లో హిజాబ్ వివాదం ప్ర‌పంచాన్ని క‌దిలించేలా చేసింది. భార‌త్ ప‌రువును గంగ‌లో క‌లిపేలా చేసింది. ఇక విచిత్రం ఏమిటంటే గుజ‌రాత్ రేప్ నిందితుల‌ను విడుద‌ల చేయాల‌ని కేంద్రం సిఫార‌సు చేయ‌డం మ‌రో విశేషం. 

విచిత్రం ఏమిటంటే విడుద‌లైన రేప్ నిందితుల్లో ఒక‌రు హిందువులు రేప్ లు చేయ‌ర‌ని చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిని ఎంపీలు మ‌హూవా మోయిత్రా, ప్రియాంక చ‌తుర్వేది తీవ్రంగా నిర‌సించారు.

మ‌ళ్లీ మొద‌టికొస్తే మంత్రి వి. సోమ‌న్న(V Somanna) చేసిన దానికి ప‌శ్చాతాప ప‌డాలి. లేదంటే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాలి. నిస్సిగ్గుగా తాను ఏమీ

చేయి చేసుకోలేద‌ని వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు చిలుక ప‌లుకులు ప‌లికే హైక‌మాండ్ ప‌ల్లెత్తు మాట కూడా మాట్లాడ‌క పోవ‌డం విడ్డూరం.

వీరా దేశాన్ని ఎలా ర‌క్షిస్తారో పైనున్న దేవుళ్ల‌కే తెలియాలి. ఎర్ర‌కోట సాక్షిగా మ‌హిళా సాధికార‌త గురించి మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి మోదీ ఎందుకు

మౌనంగా ఉన్నారో కూడా ప్ర‌జ‌ల‌కు చెప్పాలి. మ‌హిళా లోకం సిగ్గు ప‌డేలా..త‌ల దించుకునేలా జ‌రుగుతున్న ఈ ఘ‌ట‌న‌లు రోజు

రోజుకు పెరుగుతాయే త‌ప్పా త‌గ్గ‌వు.

ప్ర‌శ్నించే స్వ‌భావాన్ని అల‌వ‌ర్చుకోనంత కాలం..పోరాడనంత కాలం ఇలాంటి దాడులు..హ‌త్య‌లు..అత్యాచారాలు..లైంగిక వేధింపులు

కొన‌సాగుతూనే ఉంటాయి. మ‌హిళ‌లు సంఘటితం కావాలి.

త‌న‌ను తాను ర‌క్షించుకునే ధైర్యాన్ని అల‌వ‌ర్చుకోవాలి. ఇలాంటి మృగాళ్ల‌ను ఎదుర్కోవాలంటే ఉమ్మ‌డిగా ప్ర‌య‌త్నిస్తేనే బ‌య‌ట ప‌డ‌గ‌ల‌రు.

Also Read : అయోధ్య అద్భుతం ‘మోదీ’ దీపోత్స‌వం

Leave A Reply

Your Email Id will not be published!