Vaiko : కేంద్రం తీరుపై వైగో..అళగిరి కన్నెర్ర
హిందీని ఒప్పుకోం అవసరమైతే యుద్దం
Vaiko : కేంద్రంలోని మోదీ బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. తనకు తోచిన రీతిలో నిర్ణయాలు తీసుకుంటూ ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కారణం అవుతోంది. ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందంటూ ముందు నుంచీ తమిళనాడు వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డీఎంకే చీఫ్, సీఎం ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కమిటీ హిందీని తప్పనిసరిగా అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి నివేదిక సమర్పించింది. దీనిపై వాదోపవాదాలు, చర్చోపచర్చలు, ఆరోపణలు, విమర్శలు, ఆందోళనలు మిన్నంటాయి.
కేంద్రం తన ప్రయత్నాలను విరమించు కోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు స్టాలిన్. తాజాగా హిందీ భాష అమలు వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో(Vaiko), టీఎన్సీసీ చీఫ్ కేఎస్ అళగిరి. హిందీ భాషను బలవంతంగా రుద్దాలని ప్రయత్నిస్తే దేశం ముక్కలవుతుందని హెచ్చరించారు.
112 సిఫార్సులతో 11వ నివేదికను సమర్పించడంపై మండిపడ్డారు. అధికార భాష పేరుతో దేశ వ్యాప్తంగా హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే యుద్దం తప్పదన్నారు. భిన్నత్వంలో ఏకత్వం పేరుతో ఒకే దేశం, ఒకే భాష, ఒకే సిద్దాంతం, ఒకే పార్టీ అన్న నినాదంతో బీజేపీ చేస్తున్న కుట్రను తాము ఒప్పుకోబోమన్నారు వైగో, అళగిరి.
ఇదే పరిస్థితి గనుక కొనసాగితే దేశంలో అలజడి జరగక తప్పదని హెచ్చరించారు వైగో. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై నిప్పులు చెరిగారు.
Also Read : అభిషేక్ రావు సరే తర్వాత ఎవరో