Vallabhaneni Janardhan : నటుడు ‘వల్లభనేని’ ఇక లేరు
తెలుగు సినిమా రంగంలో మరో విషాదం
Vallabhaneni Janardhan : ఈ ఏడాది ఇంకా పూర్తి కాకుండానే తెలుగు సినిమాకు కోలుకోలేని షాక్ ఇస్తూ వస్తోంది. ఒకరి వెంట మరొకరు లోకాన్ని వీడుతున్నారు. దిగ్గజ నటులు కృష్ణం రాజు, నటశేఖర కృష్ణ, నట సార్వ భౌముడిగా పేరొందిన కైకాల సత్యనారాయణ , చలపతిరావు వెళ్లి పోయారు. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది.
ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాతగా పేరొందిన వల్లభనేని జనార్దన్(Vallabhaneni Janardhan) తీవ్ర అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఇటీవలే ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఇక లేరన్న విషయం తెలిసిన వెంటనే సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగి పోయింది.
ఆయనకు 63 ఏళ్లు. ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రముక దర్శక, నిర్మాత విజయ బాపినీడు కూతురిని పెళ్లి చేసుకున్నారు. ఇక వల్లభనేని జనార్దన్ స్వస్థలం ఏలూరు లోని పోతునూరు. 1959 సెప్టెంబరర్ 25న పుట్టారు. చిన్నతనం నుంచే సినిమాలు అంటే పిచ్చి.
ఆయన చంద్రమోహన్ తో అమాయక చక్రవర్తి సినిమా తీశారు. ప్రముఖ నటుడు శోభన్ బాబుతో తోడు నీడ మూవీని నిర్మించారు. ఆయన చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ లో తండ్రి పాత్ర పోషించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాలోని ప్రముఖ నటులతో వల్లభనేని జనార్దన్ కలిసి నటించారు.
వారిలో ప్రముఖులైన వెంకటేశ్ , నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, తదితర నటులతో సాన్నిహిత్యం ఉంది. బుల్లితెరపై కూడా నటనతో అలరించారు జనార్దన్. ఆయన మరణం సినిమా రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు చిరంజీవి.
Also Read : ‘పఠాన్’ సినిమాకు సెన్సార్ బోర్డు షాక్