Varalaxmi Sarathkumar : తమిళ, కన్నడ, మలయాళం, తెలుగు సినీ రంగంలో తనదైన పాత్రలతో అలరిస్తూ వస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ పుట్టిన రోజు ఇవాళ. ఆమె వయసు 36 ఏళ్లు.
1985 మార్చి 5న బెంగళూరులో పుట్టారు. తండ్రి శరత్ కుమార్ నటుడు. తల్లి ఛాయ. ఎడిన్ బర్గ్ యూనివర్శిటీలో ఎంబీఏ చేసింది.
పలు భాషల్లో పట్టుంది. పూర్తి ఇండిపెండెంట్ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా పేరుంది వరలక్ష్మికి.
చిన్న వయసులోనే పరిణతి చెందిన నటిగా తనను తాను ప్రూవ్ చేసుకుంది.
ఈ మధ్య తెలుగులో వచ్చిన క్రాక్ లో తన పాత్రతో ఆకట్టుకుంది. కెరీర్ పరంగా చూస్తే తొలి తమిళ చిత్రం పొడా పోడి లో నటించింది.
ఈ మూవీ 2012లో విడుదలైంది. ఇందులో లండన్ కు చెందిన నర్తకి పాత్రలో మెప్పించింది.
2017లో వచ్చిన విక్రమ్ వేద మూవీలో వరలక్ష్మి నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో ఉత్తమ సహాయ నటి కేటగిరీకి ఎంపికైంది.
2020లో డానీ లో నటించింది. సవతి తల్లి ప్రముఖ నటి రాధిక. నటనకంటే ముందు ముంబై లోని అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో నటనకు మెరుగులు దిద్దుకుంది.
ఆత్మ విశ్వాసం, ధైర్యం, ప్రతిభ, నైపుణ్యం, నేర్చుకునే సౌలభ్యం వరలక్ష్మి సొంతం. ఇదే ఆమెను ప్రత్యేకమైన నటిగా ఉండేలా చేసింది
. 2014లో కన్నడ చిత్రం మాణిక్యలో సుదీప్ తో కలిసి నటించింది.
మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రముఖ దర్శకుడు బాలా దర్శకత్వంలో తరై తప్పటై 2016లో చేసింది.
2018లో టీవీ షోకి వరలక్ష్మి(Varalaxmi Sarathkumar ) హోస్ట్ గా పని చేసింది.
2018లో విజయ్ నటించిన సర్కార్ లో ప్రతి నాయకిగా నటించింది.
ఈ సినిమా సూపర్ సక్సెస్ గా నిలిచింది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో యశోధ మూవీలో నటిస్తోంది.
పలు భాషల్లో పట్టు ఉన్న వరలక్ష్మికి జీవితం పట్ల అంతకు మించి తన మీద తనకు విశ్వాసం ఎక్కువ. అందుకే ఆమెతో ఎవరూ ఎక్కువగా మాట్లాడే సాహసం చేయరు.
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ , నిర్మాతల వేధింపులను బహిరంగంగానే నిరసించారు. నిలదీశారు వరలక్ష్మి.
Also Read : ఫిట్ నెస్ విషయంలో సమంత సూపర్