Varalaxmi Sarathkumar : మా నాన్న పేరు వాడుకోలేదు
స్వయం కృషితోనే పైకి వచ్చా
Varalaxmi Sarathkumar : ప్రముఖ నటుడు శరత్ కుమార్ ముద్దులు కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతా తాను తన తండ్రి పేరుతో సినిమాల్లో అవకాశాలు దక్కించు కుంటున్నట్లు అనుకుంటున్నారు. కానీ స్వశక్తితో పైకి వచ్చానని, తన నటనను చూసి సినిమాల్లో అవకాశాలు ఇస్తున్నారని పేర్కొన్నారు.
తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇదో కలల రంగుల ప్రపంచం. కొంతసేపే పాత్రలు కదలాడుతున్నంత సేపే వాటికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయం ఏ స్థాయిలో ఉన్న వారికైనా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఒక్కసారి క్రేజ్ వచ్చిందంటే దానిని నిలబెట్టుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుందని వాపోయారు వరలక్ష్మి శరత్ కుమార్.
తనకు ఓవర్ నైట్ లో పేరు రాలేదని తెలిపింది. దీని కోసం ఎంతో కష్ట పడ్డానని, ఇంకా ప్రయత్నం చేస్తున్నానని తెలిపింది. విచిత్రం ఏమిటంటే తన ఆహార్యం పూర్తిగా ప్రతినాయకి పాత్రలు లభిస్తున్నాయని, కానీ నిజ జీవితంలో తాను అలా ఉండనని స్పష్టం చేసింది వరలక్ష్మి శరత్ కుమార్.
ఇదిలా ఉండగా తాను ఏనాడూ తన తండ్రిని వాడుకుని సినిమాల్లో ఛాన్స్ పొందలేని స్పష్టం చేసింది . ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar) నటించిన క్రాక్ ఎక్కువ పేరు తీసుకు వచ్చేలా చేసింది. తాజాగా ఆమె బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డిలో బలమైన పాత్రలో నటించి మెప్పించింది.
ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read : జాక్వెలిన్.. పింకీ ఇరానీ కీలకం